కాంగ్రెస్‌ను కలవర పెట్టించడమే రేవంతుడి లక్ష్యమా?

Submitted by santosh on Fri, 05/11/2018 - 14:25
what is revath plan

తెలంగాణ కాంగ్రెస్‌ను ఖంగు తినిపించిన రేవంత్ రెడ్డి కామెంట్స్.. ఇప్పుడు ఢిల్లీ అధిష్టానానికి పాకాయి. పార్టీ సీనియర్ నేతలంతా.. ఒకరి తర్వాత ఒకరు వరుసపెట్టి హైకమాండ్‌కు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. అసలు వ్యవహారం తేల్చుకునేందుకు స్వయంగా రేవంతే ఢిల్లీకి వెళ్తున్నారట. పంచాయతీ రాహుల్ దగ్గరికి చేరితే.. టీ కాంగ్‌లో నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

టీ కాంగ్రెస్.. తనను సరిగ్గా వాడుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో కాక పుట్టించాయ్. రేవంత్ వ్యాఖ్యలతో.. సీనియర్లంతా ఒక్కటయ్యారు. పార్టీ పనితీరు, సీఎం పదవి, హైకమాండ్‌తో షరతుల మేరకే పార్టీలో చేరినట్లు చేసిన వ్యాఖ్యలపై.. రేవంత్‌పై పార్టీ ఇంచార్జ్ కుంతియాకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీని ఢీకొట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఇలా హైకమాండ్‌పై పదవుల కోసం అసంతృప్తి వ్యక్తం చేస్తే ఎలా అంటూ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్‌పై కంప్లైంట్ చేసిన వాళ్లలో.. సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పొంగులేటి, వీహెచ్ ఇతర నాయకులు ఉన్నట్లు సమాచారం.

మరో సీనియర్ నేత.. రేవంత్‌కు ఇంకా టీడీపీ ఫీవర్ పోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకసారి మీటింగ్ పెట్టి.. కాంగ్రెస్ నియమ, నిబంధనలు వివరించాలని సూచించారట. ఇంకొకరమో.. రేవంత్‌కు ఇస్తానన్న పదవిపై క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా అన్న అభిప్రాయం వెలిబుచ్చారట. ఏదైనా ఉంటే.. పార్టీ సీనియర్లు, నేతలతో చర్చించాలి గానీ.. ఈ రకమైన కామెంట్స్ చేసి.. పార్టీ పరువు తీయడమేంటని.. పార్టీ ఇంచార్జ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మరికొందరు సీనియర్లు.. రేవంత్ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారట. పార్టీలో చేరిన కొన్నాళ్లకే.. పదవిపై క్లారిటీ లేకుండానే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్‌.. అధికార పార్టీ క్యాష్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారట. ఇదంతా ఇక్కడ తేలే వ్యవహారం కాదని.. హైకమాండ్ దగ్గరే.. రేవంత్‌కు ఇచ్చే పదవిపై ఫుల్ క్లారిటీ వస్తుందన్నారు. దీంతో.. అసలు వ్యవహారం తేల్చుకునేందుకు స్వయంగా రేవంతే ఢిల్లీకి వెళ్తున్నారట. పంచాయతీ రాహుల్ దగ్గరికి చేరితే.. టీ కాంగ్‌లో నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

English Title
what is revath plan

MORE FROM AUTHOR

RELATED ARTICLES