ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాల వెనక కారణం?

ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాల వెనక కారణం?
x
Highlights

“ఎవరినీ రహస్యంగా కలవొద్దు.. ఎవరితో రహస్య సమావేశాలు వద్దు” అంటూ.. టీడీపీ ఎంపీలకు.. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు....

“ఎవరినీ రహస్యంగా కలవొద్దు.. ఎవరితో రహస్య సమావేశాలు వద్దు” అంటూ.. టీడీపీ ఎంపీలకు.. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న రాజకీయ పోరాటం నేపథ్యంలో.. ఈ మధ్యే ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన కారణంగా.. ప్రతీ అడుగునూ జగ్రత్తగా వేయాలని సూచించారు. దీంతో.. చంద్రబాబు ఎందుకింత ఆలోచనలో పడుతున్నారో అర్థం కావడం లేదని.. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మొదటి నుంచి బీజేపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెబుతోంది. వాళ్ల సంగతి ప్రజలు ఎలా చూసుకోవాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. కానీ.. మొదట హోదా కావాలని వాదించి.. తర్వాత కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీకి సరే అని తల ఊపి.. ఇప్పుడు మరోసారి హోదా కోసం పోరాటం చేస్తామని టీడీపీ నేతలు చెబుతుండడంతో.. కాస్త జనాల్లో కూడా మార్పు కనిపిస్తోంది. టీడీపీపై.. చంద్రబాబు నాయకత్వ లక్షణాలపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు కూడా బహిరంగంగా చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. నష్ట నివారణ చర్యలను చేపట్టిన చంద్రబాబు.. ఆ ప్రయత్నాల్లో భాగంగానే.. పార్టీ ఎంపీలను కంట్రోల్ లో పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో ఎంపీలు ఉన్నా.. తాను అమరావతిలో ఉన్నా.. నిత్యం వీడియో కాన్ఫరెన్స్ తో వారిని కంట్రోల్ చేయడం.. ఎవరినీ కలవొద్దు.. ఎవరితో మాట్లాడొద్దు.. నేను చెప్పినట్టే చేయండి.. అని చెప్పడం కూడా.. ఆదేశాలు ఇవ్వడం కూడా ఇందులో భాగమే అన్న మాట వినిపిస్తోంది.

ఈ పరిణామాలతో.. చంద్రబాబు డిఫెన్స్ లో పడినట్టే కనిపిస్తోంది. విభజన నాడు రెండు నాల్కల సిద్ధాంతాన్ని ప్రవచించిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా విషయంలో అదే అయోమయాన్ని ఎదుర్కొంటున్నట్టుగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories