పవన్ కల్యాణ్ JFC.. ఏం చేయబోతోంది?

పవన్ కల్యాణ్ JFC.. ఏం చేయబోతోంది?
x
Highlights

హోదా విషయంలో.. బడ్జెట్ కేటాయింపుల విషయంలో.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సహాయం చేసిన విషయంలో.. మేధావులను ఒక్కటి చేయగలిగారు.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్....

హోదా విషయంలో.. బడ్జెట్ కేటాయింపుల విషయంలో.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సహాయం చేసిన విషయంలో.. మేధావులను ఒక్కటి చేయగలిగారు.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఈ విషయంలో పవన్ విజయం సాధించినా.. ఇష్యూను మాత్రం మరింత ముందుకు తీసుకుపోవడంలో కాస్త వెనకపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దాదాపు నాలుగేళ్లుగా చిరకాల వాంఛలా మారిపోయిన హోదా విషయంలో.. పవన్ మరింత దూకుడుగా పోరాటం చేయలేకపోతున్నాడన్న మాట వినిపిస్తోంది.

జయప్రకాశ్ నారాయణ్ తో పాటు.. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారిని ఒక దగ్గరికి చేర్చడంలో పవన్ సఫలీకృతులైనా.. తర్వాత తన కార్యాచరణ ఏంటన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. తాను వచ్చింది ప్రశ్నించేందుకే అని తరచుగా చెప్పే పవన్.. కొన్నాళ్లు హడావుడి చేసి విషయాన్ని మళ్లీ వదిలేస్తారా.. లేక మరింత ముందుకు తీసుకుపోతారా అన్నది కూడా సందేహాస్పదంగానే కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి.. చంద్రబాబు నాయుడును సీనియర్ రాజకీయ వేత్త అని గౌరవిస్తూనే ఉన్నారు. మరోవైపు.. బాబు మాత్రం కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే ఓ ముఖ్యమంత్రిగా ఆధారాపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను అలుసుగా తీసుకుంటున్న కేంద్రం కూడా.. ఏమీ చెప్పకుండా.. ఏమీ చేయకుండా.. తోచింది చేసుకుని వెళ్తూ.. ఎంతో చేస్తున్నామన్న కలరింగ్ ఇస్తూ బాబును ఇబ్బంది పెడుతోంది.

ఇదే సమయంలో.. రాష్ట్ర పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమంటూ పవన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిజ నిర్థారణ కమిటీ ఓ రిపోర్ట్ సిద్ధం చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ఇప్పుడు పోరాటం ఎవరిపై జరగబోతోంది అన్న విషయాన్ని పవన్.. అత్యవసరంగా స్పష్టం చేయాల్సి ఉంది. ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో.. కేంద్రం నుంచి ఏం సాధించినా ఇప్పుడే సంపాదించుకోవాలి. లేదంటే.. ఆంధ్రప్రదేశ్ మరింతగా నష్టపోయే అవకాశం ఉంది.

తర్వాత మళ్లీ మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే మాత్రం.. ఇప్పుడు అందుతున్న నామమాత్రపు కేటాయింపులు కూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే.. పవన్ కల్యాణ్ ఇప్పటికిప్పుడు చేయాల్సిన పని ఏంటంటే.. తన పోరాటం ఏంటి.. అందుకు అమలు చేసే కార్యాచరణ ఏంటి అన్నది తేల్చుకోవాలి. ఆ తర్వాత.. హోదా పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందన్న అభిప్రాయం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories