శ్రీరెడ్డి ఎపిసోడ్‌పై టాలీవుడ్‌లో నెక్ట్స్ సీనేంటి.?

శ్రీరెడ్డి ఎపిసోడ్‌పై టాలీవుడ్‌లో నెక్ట్స్ సీనేంటి.?
x
Highlights

వర్మ తిట్టమన్నాడు.. శ్రీరెడ్డి తిట్టింది.. జరగాల్సిన రచ్చంతా జరిగింది. మరి తర్వాతేం జరగబోతోంది. ఇప్పటికే శ్రీరెడ్డిపై శివబాలాజీ కేసు పెట్టాడు. అల్లు...

వర్మ తిట్టమన్నాడు.. శ్రీరెడ్డి తిట్టింది.. జరగాల్సిన రచ్చంతా జరిగింది. మరి తర్వాతేం జరగబోతోంది. ఇప్పటికే శ్రీరెడ్డిపై శివబాలాజీ కేసు పెట్టాడు. అల్లు అరవింద్ కూడా వర్మను టార్గెట్ చేస్తూ.. ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఎడాపెడా వాయించేశారు.. ఇక ముందు.. ముందు.. ఎవరెలా రియాక్ట్ కాబోతున్నారు. టాలీవుడ్‌లో నెక్ట్స్ సీనేంటి.?

ఇప్పటివరకు జరిగిన రచ్చ అంతా చూశాం. కానీ.. టాలీవుడ్‌లో నెక్ట్స్ సీన్ ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీరెడ్డి.. పవన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో.. ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది. అది వర్మ పనేనని తెలియడంతో.. షేక్ అయ్యింది. ఈ విషయంలో.. పవన్‌కు మద్దతు తెలిపే వారంతా వర్మ పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారు.

శ్రీరెడ్డి ఎపిసోడ్‌లో.. ఆర్జీవీ హ్యాండ్‌పై.. అల్లు అరవింద్ కూడా వర్మకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తల్లిగా భావించాల్సిన తెలుగు ఇండస్ట్రీకి రాంగోపాల్ వర్మ ద్రోహం చేస్తున్నాడన్నారు. అతనెంత నికృష్టుడో చెప్పేందుకే తాను ప్రెస్ మీట్ పెట్టానని చెప్పారు. వర్మే తనతో అలాంటి బూతులు చెప్పించాడని శ్రీరెడ్డి బయటకు చెబుతున్న సమయంలో తన చచ్చు తెలివితేటలతో.. వర్మ ముందే ఓ వీడియో పోస్ట్ చేసి.. వెధవ నాటకం ఆడినట్లు అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో నటుడు శివబాలాజీ కేసు పెట్టారు. పవన్‌పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తనను కలచివేశాయన్నారు. రాజకీయంగా పవన్ ను, జనసేనను దిగజార్చాలన్న దురుద్దేశ్యంతోటే చేసిన వ్యాఖ్యలని.. శివబాలాజీ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యల వెనుక రాజకీయ శక్తులున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టప్రకారం శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివబాలాజీ తన ఫిర్యాదులో కోరాడు.

ఇప్పటికైతే.. శివబాలాజీ, అల్లు అరవింద్ తమ ఆక్రోశాన్ని బయటపెట్టారు. మరి మున్ముందు ఎవరెవరు వర్మను టార్గెట్ చేస్తారన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. శివబాలాజీతో మొదలైన కేసులను.. అభిమానులు కంటిన్యూ చేస్తారా.. లేక.. ఈ ఒక్క కేసుతోనే ఆగిపోతుందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories