శ్రీదేవి మ‌ర‌ణంపై ఒక‌రోజు వెన‌క్కి వెళ్లిన దుబాయ్ పోలీసులు

శ్రీదేవి మ‌ర‌ణంపై ఒక‌రోజు వెన‌క్కి వెళ్లిన దుబాయ్ పోలీసులు
x
Highlights

అతిలోక సుందరి శ్రీదేవి మరణం వెనుక దాగిన మిస్టరీ ఏంటి..? గుండె పోటా..? ప్రమాదమా..? లేక మరేదైనానా..? శ్రీదేవి మరణం తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న...

అతిలోక సుందరి శ్రీదేవి మరణం వెనుక దాగిన మిస్టరీ ఏంటి..? గుండె పోటా..? ప్రమాదమా..? లేక మరేదైనానా..? శ్రీదేవి మరణం తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న విషయం ఇది. పెళ్లి ఫంక్షన్ కోసం దుబాయికి వెళ్లిన శ్రీదేవి..ఆరు రోజులపాటు అక్కడే ఉంది. అసలు ఆ ఆరు రోజులు ఏం జరిగింది..? శ్రీదేవి మరణానికి ముందు ఆ ఆరు రోజులే ఇప్పుడు కీలకంగా మారాయి. వెండితెర జాబిలి మరణరహస్యాన్ని చేధించేందుకు ఒక్కోరోజు వెనక్కి వెళ్తున్నారు దుబాయి పోలీసులు.

పెళ్లి తతంగం ముగిసిన తర్వాత..ఫిబ్రవరి 21న శ్రీదేవిని అక్కడే వదిలిపెట్టి చిన్న కూతురితో కలిసి బోనీ కపూర్ ఇండియాకి చేరుకున్నాడు. మళ్లీ రెండు రోజుల తర్వాత ఒక్కడే దుబాయ్ వచ్చాడు. శ్రీదేవికి సడెన్ సర్ ఫ్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే దుబాయ్ హోటల్ కి చేరుకున్నాడు.

బోనీ కపూర్ దుబాయ్ కి రాకముందు మూడు రోజుల పాటు శ్రీదేవి హోటల్ గదిలో ఒంటరిగా గడిపింది. కనీసం బయిటికి కూడా రాలేదని హోటల్ సిబ్బంది ఇన్వెస్టిగేషన్ లో తెలిపారు. పెళ్లి తర్వాత శ్రీదేవి దుబాయ్ లోనే ఉండిపోవడానికి కూడా కారణాలు వివిధ రకాలుగా వినిపిస్తున్నాయి. తన పెయింటిగ్స్ వేలం వేయడం కోసమే శ్రీదేవి అక్కడే ఉండిపోయిందటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. పెద్ద కూతురి కోసం షాపింగ్ చేయడానికంటూ మరో కథనం వినిపిస్తుంది.

ఫిబ్రవరి 24, సాయంత్రం 5.30 గంటలకి..బోని కపూర్ దుబాయ్ లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ కి చేరుకున్నాడు. శ్రీదేవి, బోనీకపూర్ మధ్య ఏదో విషయంపై చిన్న సంభాషణ జరిగింది. ఆ తర్వాత డిన్నర్ కు రెడీ అయ్యేందుకు బాత్ రూంలోకి వెళ్లిన శ్రీదేవి..15 నిమిషాలు గడిచినా బయిటకు రాలేదు. డోర్ కొట్టినా స్పందించపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో బలవంతంగా డోర్ తెరిచారు.

శ్రీదేవి మరణం తర్వాత..మొదట గుర్తించింది ఎవరనే విషయంలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొదట హోటల్ సిబ్బందే ఈ విషయాన్ని గుర్తించినట్లు మరో కథనం వినిపిస్తుంది. రూమ్ సర్వీస్ కి వెళ్లిన హోటల్ సిబ్బంది గుర్తించారని..పల్స్ ఉండటంతో ఆస్పత్రికి కూడా తరలించారని మరో వార్త ప్రచారంలో ఉంది.

ఏ డాక్టర్ నిర్థారించకుండానే శ్రీదేవి మరణం కార్డియాక్ అరెస్ట్ అని ప్రకటించారు కుటుంబసభ్యులు. మరోవైపు ప్రమాదవశాత్తు జారిపడి బాత్ టబ్బులో మునిగిపోయి మరణించిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. సంఘటన జరిగినప్పుడు శ్రీదేవి ఆల్కహాల్ సేవించారని ఫొరెన్సిక్ రిపోర్ట్ లో వెల్లడయ్యింది.

ఆ ఆరు రోజులు ఏం జరిగిందనే విషయంపై ఒక్కో రోజు వెనక్కివెళ్లి ఇన్వెస్ట్ గేట్ చేస్తున్నారు దుబాయ్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే బోనీ కపూర్, హోటల్ సిబ్బందితో పోలీసులు మాక్ సీన్ క్రియేట్ చేసినట్లు సమాచారం. ఘటనలో ఎలాంటి క్రైమ్ యాంగిల్ లేదని తేలిన తర్వాతే..శ్రీదేవి మృతదేహం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.

సంతోషంగా గడుపుదామని వెళ్లిన పెళ్లి వేడుకే శ్రీదేవి మరణానికి కారణమయ్యిందా..? అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న కుటుంబకలహాలు ఒక్కసారిగా బయిటపడటంతో శ్రీదేవి ఒత్తిడికి లోనయ్యిందా..? పెళ్లి వేడుకలో బయిటికి కనిపించడానికి శ్రీదేవి నవ్వుతూనే కనిపించింది..అందరితో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపింది. అందరికీ తెలిసిందే ఇదే..కానీ ఆ నవ్వుల వెనుకే విషాదం దాగి ఉందని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అదే ఆమెకు చివరి వేడుక కానుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

బోని కపూర్ మొదటి భార్య మోనా 2012లో చనిపోయింది. ఆమెకు అర్జున్ కపూర్, అన్షు ఇద్దరు పిల్లలు. దుబాయ్ లో పెళ్లి చేసుకున్న మోహిత్ మర్వా కూడా బోని కపూర్ మొదటి భార్య మోనా తరపు బంధువు. ఈ నేపథ్యంలోనే పెళ్లికి హాజరైన బోని కపూర్..మొదటి భార్య పిల్లలతోనే ఎక్కువగా గడిపాడట .

పెళ్లి వేడుకలో బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలతో ఎక్కువగా గడపడంతో..శ్రీదేవికి, బోని కపూర్ కి మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా నడిచిందట. మొదటి భార్య కుటుంబంతో ఆర్థికంగా ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దనే షరతుకు ఒప్పుకున్న తర్వాతే బోనీ కపూర్ ను 2002లో శ్రీదేవి పెళ్లాడింది. కానీ మళ్లీ ఇన్నిరోజుల తర్వాత పెళ్లిలో..మొదటి భార్య కుటుంబం..కొడుకుతో బోనీ కపూర్ సన్నిహితంగా గడపడం శ్రీదేవికి నచ్చలేదట. ఇదే ఆమెను ఒత్తిడికి గురిచేసినట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories