శ్రీదేవి చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందంటే..

Submitted by arun on Mon, 02/26/2018 - 11:10
Sridevi

గుండెపోటు తో శ్రీదేవి మృతిచెందిందని మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ మరణానికి ముందు ఏం జరిగింది?  శ్రీదేవి మృతి చెందడానికి అరగంట ముందు అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. దుబాయ్ కి చెందిన ఓ లోకల్ పేపర్ లో వచ్చిన వార్తలు అసలు ఆరోజు పెళ్లి వేడుక తర్వాత ఏంజరిగింది. బోనీకపూర్ శ్రీదేవికి గుండెపోటు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయాలు పత్రిక వెల్లడించింది అసలు శ్రీదేవి చనిపోయే రోజు రాత్రి అరగంట ముందు ఏం జరిగింది?

మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి దంపతులు అక్కడి జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేశారు. పెళ్లి వేడుకలో అందరితో సరదాగా మాట్లాడుతూ, నవ్వుతూ ఉత్సాహంగా ఉన్న శ్రీదేవి.. ఎక్కడా ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. అందరిని విష్ చేస్తూ ఎంతో సరదా కనిపించారు.

సౌదీ అరేబియాకు చెందిన స్థానిక పత్రిక కథనం ప్రకారం..  వేడుక పూర్తయిన తర్వాత శ్రీదేవి హోటల్ కు తిరిగివచ్చి రిలాక్స్ అయ్యారు. అయితే ఆరోజు రాత్రికి శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని ఆమె భర్త బోనీ భావించారట. ఈ విషయం ఆమెకు ముందే చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారని, డిన్నర్‌ ప్రారంభానికి ముందు నిద్రపోతున్న ఆమెని లేపి 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారని ఆ పత్రిక తన కథనంలో వెల్లడించింది.

బోనీతో మాట్లాడిన తర్వాత ఫ్రెషప్ అయేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లిన శ్రీదేవి పావుగంట దాటినా బయటకు రాకపోవడంతో బోనీ కపూర్ కు అనుమానం వచ్చింది. బోనీకపూర్ వాష్‌రూమ్ తలుపు కొట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. చాలాసేపు తలుపు కొట్టినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కీడు శంకించిన బోనీ.. బలవంతంగా డోర్ తెరవగా లోపల శ్రీదేవి బాత్‌టబ్‌లో అచేతనంగా పడి ఉంది.

బాత్ టబ్ లో అచేతనంగా పడి ఉన్న శ్రీదేవిని లేపడానికి బోనీ ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే స్నేహితులను పిలిచారు. అనంతరం వైద్యులకు, పోలీసులకు సమాచారం అందించి ఆమెను హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ మొత్తం జరిగిన విషయం బోనీ కుటుంబ సన్నిహితుల ద్వారా వచ్చిన సమాచారమని ఆ పత్రిక తన కథనంలో తెలిపింది. మొత్తానికి శ్రీదేవి అకస్మాత్తుగా ఇలా గుండెపోటుతో చనిపోవడం మాత్రం అందరిని ఆవేదనకు గురిచేసింది. ఎప్పుడు నలతగా ఉన్నట్టుగా కూడా శ్రీదేవి గురించి వార్త వినని అభిమానులు ఒకేసారి ఆమె మరణ వార్త విని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
 

English Title
what happend before sridevis death

MORE FROM AUTHOR

RELATED ARTICLES