తిరుమల ఇష్యూలో అసలేం జరిగింది?

తిరుమల ఇష్యూలో అసలేం జరిగింది?
x
Highlights

కేంద్ర పురావస్తుశాఖ... టీటీడీకి పంపిన ఓ లేఖ తీవ్ర సంచలనం రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పురాతన ఆలయాల పరిశీలనకు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ...

కేంద్ర పురావస్తుశాఖ... టీటీడీకి పంపిన ఓ లేఖ తీవ్ర సంచలనం రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పురాతన ఆలయాల పరిశీలనకు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ ఈవోకి రాసిన లేఖపై దుమారం రేగింది. తిరుమల తిరుపతి టెంపుల్స్‌‌ను సురక్షిత ఆలయాల జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉందో లేదో? తెలుసుకునేందుకు సహకరించాలని విజయవాడ పురావస్తుశాఖ కార్యాలయం నుంచి టీటీడీకి లేఖ వచ్చింది. అయితే టీటీడీని తన ఆధీనంలోకి తీసుకోవడానికి కేంద్రం పావులు కదుపుతోందంటూ మీడియాలో పెద్దఎత్తున వార్తలు రావడంతో... పురావస్తుశాఖ వెనక్కి తగ్గింది. ఆ మేరకు టీటీడీ ఈవోకి రాసిన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు పురావస్తుశాఖ తెలిపింది.

దేశంలో ఏ పురాతన స్థలమైనా, ఆలమైనా పురావస్తుశాఖ సంరక్షణలోనే ఉంటాయి. అయితే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామి టెంపుల్‌, ఒంటిమిట్ట కోదండరామాలయం అత్యంత పురాతనమైనవి. ఒకప్పుడు ఇవన్నీ పూర్తిగా పురావస్తుశాఖ ఆధీనంలోనే ఉండేవి. ఆ తరువాత వాటి నిర్వహణను టీటీడీకి అప్పగించారు. అయితే ఇప్పుడు మళ్లీ సడన్‌‌గా టీటీడీ ఆధీనంలో ఉన్న పురాతన కట్టడాలను పరిశీలించడానికి, ఫొటోలను తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పురావస్తుశాఖ లేఖ రాయడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌పై కక్షగట్టిన కేంద్రం.... రోజూ కోట్ల రూపాయల ఆదాయం వస్తోన్న టీటీడీని లాక్కోవడానికి కుట్ర చేస్తోందంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో... పురావస్తుశాఖ వెనక్కి తగ్గింది.

ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ లేఖపై తీవ్ర దుమారం రేగడంతో కేంద్ర పురావస్తుశాఖ డీజీ.... టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కి ఫోన్‌ చేశారు. సమాచార లోపం కారణంగానే లేఖ పంపారంటూ వివరణ ఇచ్చారు. వెంటనే లేఖను ఉపసంహరించుకోవాలని విజయవాడ శాఖను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలను తమ పరిధిలోకి తీసుకునే ఆలోచన లేదని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా అలాంటి ఉద్దేశం లేదని కేంద్ర పురావస్తుశాఖ డీజీ చెప్పినట్లు టీటీడీ ఈవో అశోక్‌ సింఘాల్‌ తెలిపారు. ఏది ఏమైనా ఒక చిన్న లేఖ చినికి‌చినికి గాలీవానలా మారింది..

Show Full Article
Print Article
Next Story
More Stories