కొరటాలకు.. మహేష్ ఏమిచ్చాడో తెలుసా?

Submitted by hmtvdt on Wed, 05/02/2018 - 13:21
What did Koratala say to Mahesh

 

మహేష్ బాబు, కొరటాల శివ స్నేహం.. భరత్ అనే నేను సినిమా విజయంతో మరింత బలపడింది. శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి.. తర్వాత భరత్ తో రికార్డులు తిరగరాసి మహేష్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన కొరటాల శివ.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. సోషల్ మీడియా ట్విటర్ లో.. తన బావ జయదేవ్ గల్లాను మాత్రమే ఫాలో అయ్యే మహేష్.. ఇప్పుడు భరత్ సినిమా విజయం ఇచ్చిన ఆనందంతో.. కొరటాల శివకూ ఫాలోవర్ గా మారిపోయాడు.

అంతే కాదు.. శ్రీమంతుడును మించిన సక్సెస్ ఇచ్చిన కొరటాలకు అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇచ్చాడట మహేష్. ఆ నోటా.. ఈ నోటా ఈ విషయం బయటికి వచ్చినా కూడా.. కొరటాల శివ అందుకున్న ఆ బహుమానం ఏంటన్నది సస్పెన్స్ గా ఉంటోంది. కోటి రూపాయల విలువైన కారా? లేకుంటే.. అంతకు మించిన అద్భుతమైన భవనమా? ఫ్లాట్ అయి ఉంటుందా? బంగారు ఉంగరం.. లేదంటే గొలుసు? మరి ఇంకేమై ఉంటుంది?

కొరటాల శివకు మహేష్ బాబు ఇచ్చిన బహుమానం మీడియాకు తెలియకుండా దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదీ.. ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న చర్చ. ఈ విషయంలో క్లారిటీ వస్తుందో రాదో తెలియదు కానీ.. కొరటాల శివతో మహేష్ బాబు అనుబంధం.. త్వరలోనే మరో సినిమాగా రూపొందినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనాల మీద అంచనాలు వేస్తున్నాయి.

English Title
What did Koratala say to Mahesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES