తెలంగాణలో కమలం కలవరం... బెడిసికొట్టింది ఎక్కడ?

తెలంగాణలో కమలం కలవరం... బెడిసికొట్టింది ఎక్కడ?
x
Highlights

ఉత్తరాది మనది, ఇక దక్షిణాది కూడా మనదేనంటూ సంబరపడిన బీజేపీ నాయకులకు కర్నాటక చేదు అనుభవాన్ని విగిల్చింది. దక్షిణాది ముఖద్వారం కర్నాటకలో గెలుపుతో...

ఉత్తరాది మనది, ఇక దక్షిణాది కూడా మనదేనంటూ సంబరపడిన బీజేపీ నాయకులకు కర్నాటక చేదు అనుభవాన్ని విగిల్చింది. దక్షిణాది ముఖద్వారం కర్నాటకలో గెలుపుతో తెలంగాణలో కూడా పాగా వేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వ్యూహంతో విజయం సొంతం చేసుకుంటామని చెప్పిన కమలనాథులకు కర్నాటక పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ ఇక దక్షిణాదిలో తమ హవా కొనసాగుతుందని కలలు కంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయగానే దక్షిణాది రాష్ట్రాల్లో ...ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే, సుప్రీం ఆదేశాలతో... మ్యాజిక్ ఫిగర్ సాధించలేక.... బలపరీక్షకు ముందే యడ్యూరప్ప గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.... కమలనాథులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో కర్నాటక తర్వాత.... తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు పన్నిన వ్యూహాలు, ప్రణాళికలపై నీలినీడ‌లు కమ్ముకున్నాయి.

కర్నాటక తర్వాత తెలంగాణపై పట్టు సాధించాలని బీజేపీ భారీ ప్రణాళికలు వేసుకుంది. కర్నాటక తరహాలో తెలంగాణలోనూ కూడా బస్సు యాత్రకు ప్రిపేర్ అయ్యారు కమలనాథులు. గత ఎన్నికల్లో 20వేల‌కు పైగా ఓట్లు వ‌చ్చిన నియోజకవర్గాల్లో పర్యటనలకు ఏర్పాట్లు చేసుకున్నారు. పరివర్తన యాత్ర పేరుతో మొద‌ట 30 నియోజకవర్గాల్లో... ఆ త‌ర్వాత మరో 60 అసెంబ్లీ స్థానాల్లో టూర్‌కి ప్లాన్‌ చేసుకున్నారు. తమ యాత్రకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు కోరారు. అయితే కర్నాటక ఫలితంతో... బస్సు యాత్రకు పర్మిషన్ వస్తుందా లేదా అని తెలంగాణ బీజేపీ నాయకులు మదనపడుతున్నారు.

కర్నాటకలో తమ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణలో కూడా పుంజుకోవచ్చని బీజేపీ నేతలు భావించారు. కానీ కాంగ్రెస్‌-జేడీఎస్‌ దోస్తీతో ఖంగుతిన్నారు. అయితే త్రిపుర లాంటి చిన్న రాష్ట్రాన్ని సైతం వదలని అధిష్టానం... తెలంగాణను ఎలా వదిలేస్తుందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతల బస్సు యాత్రపై త్వరలోనే అమిత్‌షా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories