పసిప్రాణం అనికూడా చూడకుండా పశువులా ప్రవర్తించింది..(వీడియో)..

Submitted by nanireddy on Tue, 06/12/2018 - 07:38
waving-goodbye-mother-1-year-old-baby-attacked-babysitter-cried-cruel-woman-beat

 ఏడుస్తున్న పసిప్రాణి ప్రాణం తీసేలా ప్రవర్తించింది ఓ మహిళ.  గుక్కపట్టి ఏడుస్తున్న  బాబుపై దారుణానికి పాల్పడింది. ఇటీవల చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..వివరాల్లోకి వెళితే వ్యక్తిగత పనుల రీత్యా  ఓ మహిళ  బయటికి వెళ్లడంకోసం తన ఎనిమిది నెలల బాబును బేబీ సిట్టర్ కు అప్పగించింది.అమ్మను విడిచి ఉండలేని ఆ పసివాడు ఏడ్వడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గుక్క పట్టి ఏడ్చాడు. ఇంతలో లిఫ్ట్ లో ఉన్న బేబీ సిట్టర్ బాబును తీసుకుంది.. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చెయ్యగానే తనలోని క్రూరత్వాన్ని బయటకు తీసింది. ఏడుస్తున్న బాబుపై ఒక్కసారిగా పిడిగుద్దులతో దాడి చేస్తూ.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో బాబు తలపై కొట్టడమే కాకుండా ఒకానొక సమయంలో ఆ రాక్షశి పసిప్రాణాన్ని నేలకేసి కొట్టేంతలా ప్రవర్తించింది. దీంతో బాబు గుక్కపట్టిఏడ్చాడు.  లిఫ్ట్ లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ మహిళ బాగోతం బయటపడింది.     

English Title
waving-goodbye-mother-1-year-old-baby-attacked-babysitter-cried-cruel-woman-beat

MORE FROM AUTHOR

RELATED ARTICLES