నీటికోసం రోడ్డెక్కిన టీడీపీ నేతలు

Submitted by arun on Mon, 10/15/2018 - 15:05
water war

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వాటర్ వార్‌ రోజురోజుకు పెరుగుతోంది. సాగునీటి కోసం రోజుకో నేత రోడ్డెక్కుతున్నారు. తాజాగా తమ నియోజకవర్గానికి సాగు నీరు విడుదల చేయాలంటూ పుట్టపర్తి రైతులు కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగారు. వీరికి మద్ధతుగా స్ధానిక టీడీపీ నేతలు నిరసనకు  దిగారు. వీరి ఆందోళనకు స్ధానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ పల్లె రఘునాధరెడ్డి మద్ధతు పలికారు. హంద్రీ, నీవా కాలువ ద్వారా నీటిని ఒక నియోజకవర్గానికే పరిమితం చేస్తే ఎలా అంటూ రైతులు ప్రశ్నించారు. తమ నియోజకవర్గానికి నీరు వదిలే వరకు ఆందోళన విరమించేది లేదంటూ తేల్చి చెప్పారు. 
 

English Title
water war between tdp leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES