శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు ప్రవాహం

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు ప్రవాహం
x
Highlights

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో...

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 21,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90.313 టీఎంసీలు కాగా వరద వచ్చి చేరడంతో మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటి మట్టం 1053.50 అడుగులు, 8.197 టీఎంసీలకు చేరుకున్నది. ఇప్పటివరకు 2 టీఎంసీల నీరు వచ్చి చేరిందని, బుధవారం ఉదయం వరకు మరో టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉన్నదని ఏఈఈ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories