టాలివుడ్ క్యూట్ కపుల్ మధ్య పోటీ

Submitted by arun on Sat, 07/07/2018 - 14:09

టాలివుడ్ క్యూట్ కపుల్స్ మధ్య ఇప్పుడు టగ్గాఫర్ వార్‌ నడుస్తోంది. పెళ్లి తర్వాత హీరోయిన్ వరుస హిట్లతో దూసుకుపోతుంటే హీరో మాత్రం కాస్త వెనుకబడ్డాడు. అందుకే కాస్త లేటైనా సరే ఆడియన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈసారి తనకు టైమొచ్చిందంటున్నాడు ఆ హీరో. ఇంతకీ ఆ క్యూట్‌ కపుల్స్‌ ఎవరు? వారి మధ్య వార్‌ ఏంటీ?

క్యూట్ బ్యూటీ సమంతాకి పెళ్లి తర్వాత బాగా కలిసొచ్చింది. వరుసగా రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో సమంతా హిట్లు కొట్టింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఇటు టాలివుడ్ లో అటు కోలివుడ్ లో సమంతా సత్తా చాటుతోంది. మరోవైపు సమంతా హబ్బీ నాగచైతన్య మాత్రం ప్లాప్ తో సతమతమవుతున్నాడు.

గతేడాది సెప్టెంబర్ లో వచ్చిన యుద్ధం శరణం సినిమా తర్వాత మళ్లీ నాగచైతన్య సినిమా రాలేదు. ఓవైపు సమంతా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతుంటే చైతూ మాత్రం వెనుకబడ్డాడు. అయితే ఈసారి మాత్రం ఛాన్స్ తనకివ్వనంటున్నాడు. ఒకేసారి రెండు సినిమాలతో ఆడియన్స్ కి డబుల్ ధమాకా ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు.

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న సవ్యసాచి సినిమా ఆగష్టు 17న రిలీజ్ కానుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో సినిమా..'శైలజా రెడ్డి అల్లుడు' కూడా జూలైలోనే రిలీజ్ కి సిద్దమైంది. ఆగష్టు 31న శైలజా రెడ్డి అల్లుడు ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరోవైపు సమంతా కూడా తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సీమరాజ, సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాల్లో సమంతా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో త్వరలోనే నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి టాలివుడ్ క్యూట్ కపూల్స్ మధ్య ఇప్పుడు హిట్టు కోసం పోటీ జరుగుతోంది.

English Title
War Between Samantha and Naga Chaitanya

MORE FROM AUTHOR

RELATED ARTICLES