సమస్యలతో వణుకుతున్న వనపర్తి చెబుతున్న నిజాలు 

సమస్యలతో వణుకుతున్న వనపర్తి చెబుతున్న నిజాలు 
x
Highlights

చరిత్ర ఘనం... భవిష్యత్తు శూన్యం. ఇదీ స్థూలంగా వనపర్తి జిల్లా స్థితి, ప్రగతి. గణమైన చరిత్ర ఉన్నా.. కనీస సౌకర్యాల్లేవు. ఉపాధి కల్పనకు కనుమరుగు...


చరిత్ర ఘనం... భవిష్యత్తు శూన్యం. ఇదీ స్థూలంగా వనపర్తి జిల్లా స్థితి, ప్రగతి. గణమైన చరిత్ర ఉన్నా.. కనీస సౌకర్యాల్లేవు. ఉపాధి కల్పనకు కనుమరుగు అవుతోంది. కంపెనీలు కానరావడం లేదు. ఫలితంగా వనపర్తి జిల్లా నుంచి వలసబాటలు ఆగట్లేదు. ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లా నుంచి విడిపోయి.. ఒకే నియోజకవర్గంతోనే కొత్త జిల్లాగా ఏర్పడ్డ వనపర్తి జిల్లా.... దశ-దిశ ఏమిటోనని జిల్లా ప్రజలే అయోమయానికి గురవుతున్నారు. వనపర్తి... ఉమ్మడి మహబూబ్‍నగర్‌ జిల్లాలో నుంచి విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడింది ఈ జిల్లాలో కేవలం ఒకే ఒక నియోజకవర్గం ఉంది. అదే వనపర్తి నియోజకవర్గం.. వనపర్తి నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలున్నాయి. ఇందులో పాత మండలాలు ఖిల్లా ఘనపూర్‌‍, పెబ్బేరు, వనపర్తి, గోపాల్‌పేట, పెద్దమందడి, పాన్గల్‍... ఈ ఆరు మండలాలకు తోడు... రేవల్లి, శ్రీరంగాపూర్‌లతో కలుపుకుని మొత్తంగా ఎనిమిది మడలాలతో వనపర్తి జిల్లా ఏర్పడింది. మొత్తం 2 లక్షల 31,691 మంది ఓటర్లు ఉండగా, గత ఎన్నికల్లో 1లక్షా 68,289 ఓట్లు పొలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 59 వేల 543 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డికి 55 వేల 252 ఓట్లు వచ్చాయి. 4291 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి విజయం సాధించారు.

వనపర్తి సంస్థానాలు విలీనమైన ప్రారంభ దశలో వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికలపై రాజ వంశీయుల ప్రభావం తీవ్రంగా ఉండేది. సంస్థానం వంశీయుల ప్రభావాన్ని నిలువరించేందుకు నియోజకవర్గంలో ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గ పరిణామాలు ఆసక్తికరంగానూ రసవత్తరంగా నడుస్తోంది. సుమారు రెండు దశాబ్దాల వరకు వనపర్తిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై సంస్థానం వంశీయుల ప్రభావం గణనీయంగా ఉండేది. సంస్థానాధీశులు పరిపాలించినప్పుడు వనపర్తి ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. ఇక గోల్కొండ పత్రిక సంపాదకులు సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు అదే తరహాలో అభ్యర్థుల గుణగణాలను వ్యక్తిత్వాన్ని పరిశీలించడంతో పాటు పార్టీ ఆధారంగా ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు వనపర్తి నియోజకవర్గంలో తిరుగులేని కాంగ్రెస్‌ పార్టీ.... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీతో హోరాహోరీగా తలపడుతూ వస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. మూడు పార్టీలు బలమైనవిగా ఉండి త్రిముఖ పోటీ సాగగా... ప్రస్తుత నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్- టీడీపీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉండడంతో పరిస్థితి మారే అవకాశం ఉంది.

వనపర్తి నియోజకవర్గంలో పరిశీలిస్తే.... 1952లో ఏర్పడిన వనపర్తి నియోజకవర్గం నుంచి మొదటిసారి సురవరం ప్రతాపరెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి నాలుగుసార్లు జిల్లెల చిన్నారెడ్డి, రెండుసార్లు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగారు. 1994 నుంచి వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి... రావుల గట్టి నాయకులుగా నిలబడ్డారు. చిన్నారెడ్డి రావుల ఇద్దరూ బాల్యమిత్రులు కూడా కావడం మరో విశేషం. ఒకే స్కూల్లో చదువుకుని మంచి మిత్రులుగా రాజకీయంగా బద్ధశత్రువులుగా వనపర్తిని శాసించారు. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో నువ్వా -నేనా అన్నట్టు పోటీ పడేవారు. ఇప్పుడు మహాపొత్తుతో రాజకీయం ఎలా మారుతుందో అంతుచిక్కని పరిస్థితి. ఈ ఇద్దరిలో ఎవరికి వచ్చిన, మిగిలిన వ్యక్తి టికెట్‍ పొందిన వారికి సహకరించేందుకు సిద్ధమన్న సాంకేతాలను ఇప్పటికే ఓటర్లకు పంపించారు. రావులకి టికెట్‍ వస్తే తాను పోటీలో నుంచి తప్పుకుంటానని బాల్య మిత్రుడు చిన్నారెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా వనపర్తిలో రాజకీయంగా పరిణిత గలిగిన ఓటర్లు అధికంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో విజయం ఎవరికి కట్టబెడతారోనన్నది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories