గుడ్‌న్యూస్, వెయిటింగ్ లిస్టున్నా ట్రైన్ ఎక్కొచ్చు

గుడ్‌న్యూస్, వెయిటింగ్ లిస్టున్నా ట్రైన్ ఎక్కొచ్చు
x
Highlights

రైల్లో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకున్నారా? మీ వద్ద ఈ-టికెట్ ఉందా? కానీ మీ బెర్త్ మాత్రం వెయిటింగ్ లిస్టులో ఉందా? అయినప్పటికీ మీకు...

రైల్లో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకున్నారా? మీ వద్ద ఈ-టికెట్ ఉందా? కానీ మీ బెర్త్ మాత్రం వెయిటింగ్ లిస్టులో ఉందా? అయినప్పటికీ మీకు బెర్త్ లబించకపోయినా రైల్లో ప్రయాణించవచ్చు. వెయిటింగ్ లిస్టులో ఉన్న రైల్వే ప్రయాణికుల వద్ద ఈ-టికెట్ ఉన్నట్టయితే వారిని కూడా రైల్లో ప్రయాణించేందుకు అనుమతించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు ఇచ్చిన సాధారణ టికెట్ల లాగే ఈ-టికెట్లు కలిగిన ప్రయాణికులను కూడా రైల్లోకి ఎక్కేందుకు అనుమతించాల్సిందిగా రైల్వేశాఖను కోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద టికెట్ తీసుకున్న ప్రయాణికులను మాత్రమే రైల్లో ఎక్కేందుకు అనుమతినిస్తున్నారు. ఎందుకంటే, ఒకవేళ రైలు ఎక్కాల్సిన ప్రయాణికులు రానిపక్షంలో ఆ బెర్త్ ఖాళీగా ఉంటే వీరికి కేటాయించే అవకాశం ఉంది. కానీ, వెయిట్ లిస్టులో ఉండి ఈ-టికెట్ పొందిన ప్రయాణికులకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు.

ఈ-టికెట్లను కూడా సాధారణ టికెట్ల లాగే పరిగణించాల్సిందిగా 2014 జులైలో హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రైల్వే.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించగా.. జస్టిస్ మెడన్ బి లోకుర్‌తో కూడిన ధర్మాసనం రైల్వే పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సమయంలో కోర్టులో రైల్వే తరపున వాదించేందుకు న్యాయవాది ఎవరూ కూడా హాజరుకాకపోవడంతో కోర్టు రైల్వే పిటిషన్‌ను కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories