బోధన్‌లో బల పరీక్ష

x
Highlights

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే క్యాంప్‌కు...

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే క్యాంప్‌కు వెళ్లిన కొందరు కౌన్సిలర్లు ఓటింగ్ సమయానికి వస్తారా రారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మున్సిపల్ ఛైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అని బోధన్ మొత్తం ఇంట్రస్టింగ్‌గా ఎదురుచూస్తోంది.

బోధన్ మున్సిపల్ ఛైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్‌కు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్యకు వ్యతిరేకంగా 29 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. వీరిలో సొంతపార్టీ టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు కూడా ఉన్నారు.

బోధన్‌లో మొత్తం 35 వార్డులుండగా ఓ స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం 34 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 23 మంది సభ్యుల కోరం ఉంటేనే అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహిస్తారు. లేకపోతే వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికల అధికారిగా బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి వ్యవహరించనున్నారు. నాలుగేళ్లుగా బోధన్‌లో అభివృద్ధి పడకేసినందుకే మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టామని చెప్తున్నారు కాంగ్రెస్ కౌన్సిలర్లు.

మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్యపై పెట్టిన అవిశ్వాసంపై జరిగే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆ పార్టీ కౌన్సిలర్లకు ఆదేశాలు అందాయి. ఛైర్మన్‌పై అవిశ్వాసం వీగిపోయేలా ఎంపీ కవిత ఎమ్మెల్యే షకీల్ పావులు కదిపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లతో మంతనాలు చేసి 16 మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంప్‌కు తరలించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు చెందిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఓటింగ్‌కు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐతే ఓటింగ్ సమయానికి.. క్యాంప్‌కు వెళ్లినవాళ్లు, అజ్ఞాతంలో ఉన్న వాళ్లు వస్తే ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. మున్సిపల్ ఛైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అని బోధన్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories