అదీ అలా ఉండాలి... దిమ్మతిరిగి బొమ్మ కనిపించాలి

అదీ అలా ఉండాలి... దిమ్మతిరిగి బొమ్మ కనిపించాలి
x
Highlights

ఆ గ్రామాల్లో బడి లేదు. గుడీ లేదు. కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేదు.. సరైన రోడ్లు లేవు. ఎటు చూసినా తాటి కమ్మలతో నిర్మించిన పూరి గుడిసెలే కనిపిస్తాయి....

ఆ గ్రామాల్లో బడి లేదు. గుడీ లేదు. కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేదు.. సరైన రోడ్లు లేవు. ఎటు చూసినా తాటి కమ్మలతో నిర్మించిన పూరి గుడిసెలే కనిపిస్తాయి. 30 ఏళ్లు వెనక్కి నెట్టేసిన ఆ గ్రామాల ప్రజలు ఇప్పుడు ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. నోట్లకు అమ్ముడుపోమంటూ.. ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమికొడతామంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడం మండలం గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సంపేట గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా ఈ ఊళ్లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కనీస సౌకర్యాలైన తాగు, సాగునీరు, అంతర్గత రహదారులు, గుడి, బడి, అంగన్వాడి కేంద్రం కూడా లేదని ఆ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

30 సంవత్సరాల నుంచి నాయకులు మాయమాటలు చెప్పి మగవారికి మద్యం, ఆడవారికి చీరా జాకెట్లు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇకపై ఈసారి అలాంటి ఆటలు సాగవని తేలత్చిచెబుతున్నారు. గెలిచిన నాయకులెవరూ కనీసం మా ఊరి కనీస సౌకర్యాల గురించి పట్టించుకోవట్లేదని, రోగాలబారిన పడుతున్నా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఇంతవరకు తమ గ్రామాలలో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. తమ పిల్లలను బడికి పంపాలంటే కనీసం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపవలసి వస్తుందని, అంత దూరం కాలినడకన వెళ్ళలేక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారని వాపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాలను మధ్యలోనే వదిలేశారంటున్నారు.

అందుకే ఈ ఎన్నికల్లో తాము ఓట్లకు అమ్ముడుపోమని తీర్మానించుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఏ పార్టీ నాయకుడైన మా ఊరికి వచ్చి తమ ఇబ్బందులను గుర్తించి, అభివృద్ధి కొరకు పాటుపడతామని రాతపూర్వక హామీ ఇస్తేనే ఓటు వేస్తామని లేకుంటే ఊరి పొలిమేరాల్లోనే అడ్డుకుంటామంటున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో, అనాగకరికంగా బతుకుతున్న తాము తీసుకున్న ఈ నిర్ణయం... రాజకీయ నాయకులకు చెంపపెట్టు కావాలని అంటున్నారు. మూడు గ్రామాల ప్రజలు.

Show Full Article
Print Article
Next Story
More Stories