వోడాఫోన్ సరికొత్త డేటా ఆఫర్

Submitted by nanireddy on Sat, 08/11/2018 - 07:52
vodafone-2-new-plans-offering-35gb-and-45gb-data-day

జియో ప్రకటించిన ఆఫర్లను తట్టుకునేందుకు.ఇప్పటికే టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా గతంలో ప్రకటించిన ధరలకంటే తక్కువ ధరలతో ఎయిర్టెల్ డేటాను అందిస్తుంది. అయితే ఎయిర్టెల్ తరహాలోనే మరో టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఆసక్తికర డేటా ఆఫర్లకు తెరతీసింది. అందులో రూ .549 మరియు రూ .799 రెండు నూతన రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 549 ప్లాన్‌లో రోజుకు 3.5 జీబీ డేటాను అందిస్తోంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. ఇక రూ .799 రీఛార్జ్ తో రోజుకు 4.5జీబీ డేటా నెలకు మొత్తం 126జీబీ. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. అలాగే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ,రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి.

English Title
vodafone-2-new-plans-offering-35gb-and-45gb-data-day

MORE FROM AUTHOR

RELATED ARTICLES