ఆవును 110మంది ప్ర‌యాణికులున్న విమానాన్ని కూల్చేయ‌మ‌న్నా

Submitted by lakshman on Mon, 03/12/2018 - 19:25
Vladimir Putin

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాద‌మీర్ పుతిన్ గురించి ఎంత చెప్పుకున్నాత‌క్కువే. త‌న దైన మార్క్ పాల‌న‌తో దూసుకెళుతున్న పుతిన్ అత్యంత సున్నిత‌మైన స‌మ‌యంలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఆయ‌నకు ఆయ‌నేసాటి. అయితే ఈ నేప‌థ్యంలో  పుతిన్ ప‌రిపాల‌న పై ఓ డాక్యుమెంట‌రీ విడుద‌లైంది. ఆ డాక్యుమెంట‌రీలో పుతిన్ తీసుకున్న సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.
 ర‌ష్యా అధ్య‌క్షుడిగా ఉన్న పుతిన్ 2014లో సొచ్చిలో ఒలింపిక్స్ క్రీడల‌కు హాజ‌ర‌య్యారు. అంతేకాదు ఆ క్రీడ‌ల్ని వీక్షించేందుకు దాదాపు 40వేల‌మంది అభిమానులు హాజ‌ర‌య్యారు. వారిలో పుతిన్ కూడా ఉన్నారు. పుతిన్ ఆట‌ల్ని వీక్షించే స‌మ‌యంలో నిఘూ వ‌ర్గాల నుంచి ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. ట‌ర్కీకి చెందిన టర్కీష్‌ పీగాసస్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 737-800 విమానం ఖర్కివ్‌ నుంచి ఇస్తాంబుల్‌కు ప్రయాణిస్తున్న‌ట్లు .. అందులో ఓ ప్రయాణీకుడికి బాంబు కూడా అమర్చారని, అది ప్రస్తుతం ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న సొచ్చి వైపు దూసుకొస్తుందని ఆ ఫోన్‌ కాల్‌ సమాచారం. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పుతిన్ వెంటనే తన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సత్వరమే చేయాల్సిన దానిపై చర్చించారు.
వెంటనే 110 మంది ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని కూల్చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒలింపిక్స్ ను వీక్షించేందుకు 40 వేలమంది ప్రాణాలు కాపాడటం ముఖ్య‌మ‌ని భావించి కఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న కూడా  ఒలింపిక్స్‌ వద్దకు వెళ్లారు. అలా వెళ్లారో లేదో అంత‌లో మ‌రో ఫోన్ కాల్ విమానంలో ప్ర‌యాణికుడు తాగి ర‌చ్చ చేస్తున్నాడ‌ని , ప్రస్తుతం ఆ విమానం టర్కీ వైపే వెళుతుందని చెప్పారు. దీంతో పుతిన్‌ ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయాన్ని క్లెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ కూడా ధ్రువీకరించారు. 

English Title
Vladimir Putin Ordered Downing Passenger Plane Over 2014 Olympics Threat

MORE FROM AUTHOR

RELATED ARTICLES