మన్యంలో తూటాలు.. ఉనికే చాటే యత్నాలేనా?

Submitted by santosh on Tue, 09/25/2018 - 10:39
vizag mavo effect in telangana state

కొన్నేళ్ళుగా ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఒక్కసారిగా తూటాలు ప్రతిధ్వనించాయి. యావత్ దేశం ఉలక్కిపడింది. మావోయిస్టులు మారోసారి పంజా విసిరారు. ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేని హతమార్చారు. ఇంతకూ మన్యంలో ఏం జరుగుతోంది ? మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకే ఇలా చేశారా లేక నిజంగానే బలపడుతున్నారా ? జరిగిన సంఘటనలో పోలీసుల నిర్లక్ష్యం పాలెంత ? దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోందా ? తగ్గుతోందా ? మావోయిజం నేటికీ ఆదరణ పొందుతోందా ? తెలంగాణలో ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉండనుంది? 

ఆంధ్రప్రదేశ్ లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ను మావోయిస్టులు హతమార్చడం సంచలనం కలిగించింది. గత కొన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయి. అలాంటి సమయంలో మన్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రష్యా, చైనా, ఇతర దేశాల్లో జరిగిన విప్లవాలు భారతదేశంలో కొన్ని కమ్యూనిస్టు వర్గాలను ఆకట్టుకున్నాయి. ఆ వర్గాల నుంచి పుట్టుకొచ్చిందే నక్సలిజం. అదే నేటి మావోయిస్టులకు మూలం. అయితే కమ్యూనిజం సిద్ధాంతం విఫలమైందని, అది దేశీయం కాదనే విమర్శలూ ఉన్నాయి. మరో వైపున దశాబ్దాలుగా ప్రభుత్వం కూడా ఉక్కుపాదంతో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. సవాళ్ళు తీవ్రమైపోయిన నేపథ్యంలో మావోయిజం నానాటికీ బలహీనమవుతూ వస్తోంది. 

మావోయిస్టులు హింసకు పాల్పడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంటుంది. ప్రభుత్వం రాజ్యహింసకు పాల్పడుతుందని మావోయిస్టులు విమర్శిస్తుంటారు. ఈ రెండు వర్గాల మధ్య బలయ్యేది మాత్రం సాధారణ ప్రజానీకమే. అంతేకాదు... ఒక వర్గం ఏదైనా సంఘటనకు పాల్పడితే...మరో వర్గం అందుకు ప్రతీకారం కూడా తీర్చుకుంటుంది. అందుకే ఇకముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోడానికే భయమేస్తుంటుంది.
 

English Title
vizag mavo effect in telangana state

MORE FROM AUTHOR

RELATED ARTICLES