అమలాపాల్ తో ‘పెళ్లి’.. స్పందించిన విష్ణు విశాల్

Submitted by nanireddy on Wed, 11/28/2018 - 21:40
vishnu-vishal-thrashes-rumors-his-marriage-amala-paul

ప్ర‌ముఖ న‌టి అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఒంట‌రిగా ఉంటున్న అమలాపాల్ ఏవో అడపా దడపా సినిమాలు చేస్తోంది.ఈ క్రమంలో అమ‌లాపాల్ త‌మిళ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే వీరిరివురు వివాహం చేసుకోనున్నార‌ని జోరుగా ప్ర‌చారం జరిగింది. ఈ వార్త‌లపై విశాల్ స్పందించాడు. ‘ఇదొక స్టుపిడ్‌ న్యూస్‌. ఏదైనా కథనం రాసేటప్పుడు బాధ్యతగా రాయాలి. లేనిపోని రూమర్లు సృష్టించి, కుటుంబాలను ఇబ్బందిపెట్టడం కాదు. ఇకపై దీని గురించి ఎటువంటి కామెంట్లు చేయొద్దు. అంటూ ఘాటుగా విరుచుకుపడ్డాడు. కాగా విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా నటించిన ‘రాక్షసన్‌’ సినిమా ఈ ఏడాదే వచ్చింది.

English Title
vishnu-vishal-thrashes-rumors-his-marriage-amala-paul

MORE FROM AUTHOR

RELATED ARTICLES