నాని-శ్రీరెడ్డి ఇష్యూపై విశాల్ స్పంద‌న‌!

Submitted by arun on Wed, 06/13/2018 - 15:23
vishal

సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.  తాజాగా ఈ వివాదంపై త‌మిళ హీరో విశాల్ స్పందించాడు.
 
‘‘నాకు నాని చాలా కాలంగా తెలుసు. అత‌ను నాకు మంచి స్నేహితుడు. అంత‌మాత్రాన నేను అత‌ణ్ని గుడ్డిగా స‌మ‌ర్థించ‌ను. తాజాగా నానిపై ఆమె (శ్రీరెడ్డి) చేసిన ఆరోప‌ణ‌లు అస‌మంజ‌సంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లంద‌రికీ సాటి మ‌నుషుల‌తో అత‌ని ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందో తెలుసు. ఏదో ప‌బ్లిసిటీ కోసం ఆరోప‌ణ‌లు చేయ‌డం కాకుండా.. ఆమె వ‌ద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాలి. ఇదంతా చూస్తుంటే ఒక‌రి త‌ర్వాత ఒక‌రిని ఆమె వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్న‌ట్టుగా ఉంది. తర్వాత నా మీద కూడా ఆమె ఆరోప‌ణలు చేస్తుందేమో’’ అని విశాల్ అన్నాడు. అయితే అన్ని సినీ పరిశ్ర‌మ‌ల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంద‌నేది మాత్రం వాస్త‌వ‌మ‌ని చెప్పాడు. ‘అభిమన్యుడు’ విజ‌యోత్స‌వ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. విశాల్-సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

English Title
Vishal responds on Nani and Sri Reddy issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES