విశాల్ పందెంకోడి 2 రిలీజ్ డేట్ వచ్చేసింది..

Submitted by nanireddy on Tue, 07/10/2018 - 17:16
vishal-pandem-kodi-2-will-release-18th-october

అభిమన్యుడు సూపర్ డూపర్  హిట్ అందుకున్నాడు హీరో విశాల్. ఈ ఉత్సాహంతో విశాల్ మరో పందెం కోడిని బరిలోకి దింపుతున్నాడు. దాదాపు పదమూడేళ్ల క్రితం వచ్చిన పందెంకోడి సినిమా విశాల్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించారు. ఇందులో విశాల్‌కు జోడిగా కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. ఎన్‌ లింగుస్వామి డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్‌ 18న విడుదల కానున్నట్లు విశాల్‌ తెలిపారు. ఇదిలావుంటే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయమంటున్నారు సినీ పండితులు.

English Title
vishal-pandem-kodi-2-will-release-18th-october

MORE FROM AUTHOR

RELATED ARTICLES