జనవరిలో హీరో విశాల్‌ వివాహం

Submitted by arun on Sat, 02/10/2018 - 16:12
Hero vishal

కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. వచ్చే జనవరిలో తన పెళ్లి జరగనుందని విశాల్ ప్రకటించాడు. కాగా నడిగర్ సంఘం నూతన భవనం పూర్తయ్యేవరకు పెళ్లి చేసుకోనని అప్పట్లో ప్రకటించిన విశాల్.. ఇప్పుడు ఆ మాటమీదనే నిలబడ్డాడు. అయితే పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్‌ వెల్లడించలేదు. నిన్న (శుక్రవారం) అతడు చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్‌ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకు మండపానికి అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకున్నట్లు విశాల్‌ పేర్కొన్నాడు.
 

English Title
Vishal confirms wedding plans

MORE FROM AUTHOR

RELATED ARTICLES