విరాట్ రికార్డు డబుల్ సెంచరీ

Highlights

ఢిల్లీ టెస్టులో టీమిండి యంగ్ కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు ఒక పక్క వికట్లు పడుతున్నా కోహ్లి జోరు ఏమాత్రం తగ్గలేదు తనదైన షాట్లతో...

ఢిల్లీ టెస్టులో టీమిండి యంగ్ కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు ఒక పక్క వికట్లు పడుతున్నా కోహ్లి జోరు ఏమాత్రం తగ్గలేదు తనదైన షాట్లతో చెరేగిపోయిన కోహ్లి 228 బంతుల్లో 20 బౌండరీల సహాయంతో ద్విశతకాన్ని నమోదు చేశాడు కోహ్లి. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓవర్‌నైట్ స్కోర్ 371/4తో రెండో రోజు ఆట ప్రారంభించింది. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ.. 238 బంతుల్లో 201 పరుగులు సాధించాడు. కెరీర్‌లోనే కాదు కెప్టెన్‌గా కూడా అతనికి ఇది 6వ డబుల్ సెంచరీ. ఇప్పటి వరకు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట 5 డబుల్ సెంచరీలతో ఉన్న రికార్డు బద్దలైంది. అంతే కాదు ఇండియా తరపున 6 డబుల్ సెంచరీలు చేసిన 3వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 17 నెలల్లోనే కోహ్లీ.. ఈ ఆరు డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో రెండో టెస్టులోనూ కోహ్లీ.. 213 పరుగులు చేసిన విషయం విదితమే. సెహ్వాగ్, సచిన్ ఆరేసి డబుల్ సెంచరీలు చేశారు. వరుసగా 2 టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన 5వ బ్యాట్స్‌మెన్, 2వ ఇండియన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వినోద్ కాంబ్లీ తర్వాత కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories