రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న కోహ్లి, మీరాబాయ్ చాను

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న కోహ్లి, మీరాబాయ్ చాను
x
Highlights

భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను ఈ...

భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2018 కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 2016 సీజన్లోనే ఖేల్ రత్న పురస్కారం కోసం కొహ్లీ పేరును ప్రతిపాదించినా ఎంపిక కాలేకపోయాడు. అయితే గత ఏడాదికాలంగా అసాధారణంగా రాణించిన కొహ్లీ ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 594 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం ఆటగాడిగా,కెప్టెన్ గా అందుకోగలిగాడు. మరోవైపు ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను బంగారు పతకం సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అంతటితో ఆగిపోకుండా గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో సైతం స్వర్ణ పతకం సంపాదించింది. విరాట్ కొహ్లీ రాజీవ్ ఖేల్ రత్న గౌరవం పొందిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరనున్నాడు. గతంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే రాజీవ్ ఖేల్ రత్న గౌరవం పొందిన క్రికెటర్లుగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories