వారెవ్వా కోహ్లీ.. టెస్ట్ క్రికెట్ 5వేల పరుగుల క్లబ్ లో విరాట్

Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ టెస్ట్ క్రికెట్ 5వేల పరుగుల క్లబ్ లో చోటు సంపాదించాడు. ఈ ఘనత సాధించిన భారత 11వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు....

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ టెస్ట్ క్రికెట్ 5వేల పరుగుల క్లబ్ లో చోటు సంపాదించాడు. ఈ ఘనత సాధించిన భారత 11వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. హోంగ్రౌండ్ న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన ఆఖరిటెస్ట్ తొలిరోజు ఆటలో కొహ్లీ 5వేల పరుగుల మైలురాయి చేరాడు. అత్యంత వేగంగా 20 టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ గా సైతం కొహ్లీ రికార్డుల్లో చేరాడు. కొహ్లీ కేవలం 105 ఇన్నింగ్స్ లోనే ఐదువేల టెస్ట్ పరుగులు సాధించడం విశేషం. తన కెరియర్ లో 63వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కొహ్లీకి 20 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత సైతం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories