విరాట్‌-అనుష్క పెళ్లిపై మరో షాకింగ్‌ న్యూస్‌

విరాట్‌-అనుష్క పెళ్లిపై మరో షాకింగ్‌ న్యూస్‌
x
Highlights

విరాట్‌- అనుష్క పెళ్లి.. గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతున్న మాట. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం.. దాన్ని అనుష్క మేనేజర్‌...

విరాట్‌- అనుష్క పెళ్లి.. గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతున్న మాట. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం.. దాన్ని అనుష్క మేనేజర్‌ ఖండించడం.. ఆ తర్వాత అనుష్క ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం.. ఇలా కొన్నిరోజులుగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇటలీలో ఈ వారంలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. "విరాట్, అనుష్కల పెళ్లి జరగబోవడం లేదని... వాళ్లిద్దరూ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు" అంటూ ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. గత శనివారమే ఆ జంట ఒక్కటైందన్నారు. ఈ విషయాన్నే త్వరలో విరుష్కలు అధికారంగా ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.డిసెంబర్‌ 9-12 తేదీల మధ్యలో వీరి వివాహం జరుగుతుందనే తొలుత ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా వార్త ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories