దొంగలు కావలెను! గంటకు జీతం రూ.5,000

దొంగలు కావలెను! గంటకు జీతం రూ.5,000
x
Highlights

సర్వసాధారణంగా దొంగతనాలను అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఓ దేశంలో మాత్రం గిట్టకాదు తమ షాపులో దొంగతనం...


సర్వసాధారణంగా దొంగతనాలను అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఓ దేశంలో మాత్రం గిట్టకాదు తమ షాపులో దొంగతనం చేయడాని పనోళ్లు కావాలని ఏకంగా ప్రకటన చేసింది. కాగా ఇక్కడ దొంగతనాలు చేయడం కాదే ఎట్ల చేశారో చెబితే గంటకు రూ. 5000 వేల రూపాలు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే గిది ఎక్కడ అనుకుంటుర్రా ఏంది..? బ్రిటన్ దేశానికి చెందిన ఓ షాపు ప్రతినిధి బార్క్ డామ్ వెబ్ సైట్ లో ఈ ప్రకటన చేశారు. అయితే ఈ నెల క్రిస్మస్ పండుగా వస్తున్నది కదా అందుకు ఈ షాపులో జనాలు కిక్కిరిసిపోయి దొంగతనాలు విపరితంగా జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. దింతో ఎలాగైనా దొంగతనాలకు స్వస్తి చేప్పేందుకు దొంగతనంలో మంచి ఎక్స్పట్ల్లను తెలివైన దొంగలను నియమించుకోవాలనుకున్నారట. దొంగతనం ఎలా చేస్తారో అనే విషాయాన్ని చెప్పి స్వయంగా వస్తువులను ఏలా దొంగతనం చేస్తారో చేసి చూపెట్టాలి. అట్ల చేస్తే గంటకు రూ.5,000 చెల్లిస్తామని ప్రకటించారు. వారి సలహాలు, సూచనలతో షాపులో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. తమ షాపుల్లో విపరీతంగా చోరీలు జరుగుతున్నాయనీ, ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మంచి పనితనం ఉన్న దొంగ దొరకాలని మనమూ ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories