కేటీఆర్‌పై పోటీ చేసేదెవరో తెలుసా?

Submitted by arun on Thu, 09/13/2018 - 15:17
kancha ilaiah

రాబోయే ఎన్నికల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీచేసే స్థానం నుంచి ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను, మంత్రి కేటీఆర్‌ పోటీచేసే స్థానం నుంచి ప్రజా గాయని విమలక్కను బరిలోకి దింపుతామని టీ మాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య వెల్లడించారు. గద్దర్, విమలక్కలు తెలంగాణకు అసలైన వారసులని చెప్పారు. రాష్ట్రం కోసం వీరిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న గద్దర్ పై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని... ఆయనకు 6 బుల్లెట్ గాయాలు తగిలాయని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం విమలక్క కాలుకు గజ్జె కట్టి ఆడిపాడారని అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వివరాలను వెల్లడించారు. ఏ త్యాగం చేయని కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని విమర్శించారు. గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు కృషి చేయాలన్నారు. వారిపై పోటీ పెట్టకుండా కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల వారు సహకరించాలని కోరారు. పోటీ పెట్టవద్దని రాహుల్‌ గాంధీ, కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలకు వినతిపత్రం సమర్పించనున్నట్లు ఐలయ్య స్పష్టం చేశారు. సమావేశంలో టీమాస్‌ ఫోరం కన్వీనర్‌ జాన్‌వెస్లీ, నాయకులు హిమబిందు, రేఖ ముక్తాల, మన్నారం నాగరాజు, శ్రీరాం నాయక్,ప్రొఫెసర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. 

English Title
vimalakka contest against ktr says kancha ilaiah

MORE FROM AUTHOR

RELATED ARTICLES