ప్రచారంలో హోరెత్తుతున్న నిరసనలు...మళ్లీ మోసం చేస్తావా అంటూ...

Submitted by arun on Tue, 10/09/2018 - 10:41
trs

ఎన్నికల ప్రచారంతో నేతలు హోరెత్తిస్తున్నారు. ఓట్ల కోసం పల్లెల బాట పట్టారు. గ్రామాలకు వెళ్లిన అభ్యర్థులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమ గ్రామంలో ఏం అభివృద్ది చేశారంటూ నిలదీస్తున్నారు. మంచిర్యాల జిల్లా బాదంపల్లిలో ప్రచారానికి వెళ్లిన ఖానాపూర్ టీఆర్ ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ ను స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు  చేపట్టలేదని ఇప్పుడు ఓట్ల కోసం తమ గ్రామానికి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మంజూరైన సబ్సిడీ, అభివృద్ధి  పథకాల్లో కమిషన్లు లాగిందని వారు ఆరోపించారు. ఉద్యమ కారులను కాదని డబ్బులు ఉన్నవాళ్లకే నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని అడ్డుకున్నారు. 

ఇటు ఖమ్మం జిల్లా వైరా నియోజవకర్గ ఏన్కూరు మండలం గంగుల నాచారం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ ఇంటింటి ప్రచారం నిర్వంచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మా గ్రామానికి ఇచ్చిన హామీలు  నెరవేర్చలేదని నిలదీశారు. మరలా ఓట్ల కోసం వచ్చి మోసం చేస్తావా అంటూ ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధి పనుల హామీకి స్టాంపు పేపర్ పై సంతకాలు చేసి ఇస్తేనే ఓట్లు వేస్తామని అన్నారు.  గ్రామస్తుల నిలదీతలతో అభ్యర్థులు హడలిపోతున్నారు. ఈసారి గెలిపిస్తే అభివృద్ది చేస్తామని నచ్చజెప్పుతూ ముందుకు సాగుతున్నారు. 

Tags
English Title
villagers give shock to mla candidates

MORE FROM AUTHOR

RELATED ARTICLES