విజయవాడలో విద్యార్థులపై కళాశాల డైరెక్టర్‌ వీరంగం

Submitted by santosh on Sat, 05/05/2018 - 13:12
vijayawada college director attack on students

విజయవాడలో ఓ కళాశాల డైరెక్టర్‌ రెచ్చిపోయాడు. పరీక్ష రాయాల్సిన ఐదుగురు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధుతుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో డైరెక్టర్ తమపై దాడి చేశాడంటూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. ఈ ఘటన విజయవాడ కానూరులో జరిగింది.

ఇంతకీ విద్యార్థులు చేసిన నేరం..హాస్టల్లో దొంగతనం జరిగిందని డైరెక్టర్‌ ఫణికుమార్‌ను నిలదీయడమే. చోరీ గురించి ఫిర్యాదు చేసిని పట్టించుకోకపోడంపై బాధిత స్టూడెంట్స్..డైరెక్టర్‌తో వాదనకు దిగారు. అంతే... తనకే నీతులు నేర్పుతారా అంటూ ఫణికుమార్ వీరంగమాడాడు. విద్యార్థులు నీట్‌ పరీక్ష రాయాల్సి ఉందన్న ఆలోచన కూడా మరచిపోయి..లావుపాటి పీవీసీ పైపు తీసుకొని వారిపై దాడి చేశాడు. గంటల పాటు ఐదుగురిని చితకబాదాడు. ఇందులో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలవగా..మరో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. అమానుషంగా ప్రవర్తించిన డైరెక్టర్ ఫణికుమార్‌పై విద్యార్థులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫణికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.


  

English Title
vijayawada college director attack on students

MORE FROM AUTHOR

RELATED ARTICLES