ఎట్టకేలకు రాజకీయ మౌనం వీడిన విజయశాంతి

Submitted by arun on Tue, 09/18/2018 - 08:52
vj

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి ఎట్టకేలకు మౌనం వీడారు. 2014 ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేని విజయశాంతి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీకాంగ్రెస్‌ ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. సీనియర్ లీడర్లు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మధుయాష్కీ, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిపి ఒక టీమ్‌గా కమిటీ వేస్తే ప్రభావముంటుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటూ సీనియర్లతో ప్రచార కమిటీని నియమిస్తేనే కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంటుందని అన్నారు. తన అభిప్రాయాలను, విన్నపాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేశారు. 

English Title
vijayashanthi says campaign committee is good

MORE FROM AUTHOR

RELATED ARTICLES