త్వరలో జాన్వీతో సినిమా చేస్తా: విజయ్‌ దేవరకొండ

Submitted by chandram on Fri, 11/30/2018 - 13:41
Vijay

పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా, అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు విజయదేవరకొండ. దేవరకొండ ఇప్పుడు తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా అర్జున్ పేరు మారుమోగిపోతుంది. శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ తన డెబ్యూ మూవీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో రాపిడ్ ఫైర్ లో భాగంగా కరణ్ జోహార్ జాన్విని ఒక చిన్ని ప్రశ్న అడిగాడు. ఒక రోజు ఉదయం నిద్రలేవగానే పురుషుడిగా మారిపోవాలంటే హీరోను ఎంచుకుంటావు అని అడిగాడు. జాన్వీ కపూర్ తడుముకోకుండా విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇచ్చింది. దింతో విజయ్ దేవరకొండ గురించి కామెంట్ చేయడం రసవత్తరంగా మారింది. కాగా ఇదే విషయంపై విజయ్ స్పందిస్తూ అతి త్వరలోనే జాన్వీ, కరణ్ జోహార్ లతో సినిమా చేస్తా అంటూ సంచలన కామెంట్ తో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. చూడాలి ఈ ఇద్దరి మధ్య సినిమా రాబోతుందో? లేక విజయ్ దేవరకొండ సరదగా ఈ మాట అన్నాడో వేచి చూడాలి.
 

English Title
Vijay Devarakonda‍ says Next Movie With Janhvi Kapoor

MORE FROM AUTHOR

RELATED ARTICLES