ప్రజాస్వామ్య విజయం.. ‘సెమీస్‌’ ఫలితాలపై మమత ట్వీట్లు

ప్రజాస్వామ్య విజయం.. ‘సెమీస్‌’ ఫలితాలపై మమత ట్వీట్లు
x
Highlights

హోరాహొరిగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిపై తాజాగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతాబెనర్జీ స్పందించారు. 2019 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా...

హోరాహొరిగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిపై తాజాగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతాబెనర్జీ స్పందించారు. 2019 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తాజా ఫలితాలు కేంద్రఅధికార పార్టీకి భారీ షాక్ తగిలిందన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఇది మూమ్మటికి ప్రజల తీర్పేనని బీజేపీ నిరంకుశ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు. బీజేపీ తగిన బుద్దిచెప్పారని ఘాటుగా స్పందించారు. ఇక ఈ సందర్భంగా గెలిచిన ప్రతిఒక్క అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు. 2019 ఫైనల్ మ్యాచ్‌కు ఇది నిజమైన ప్రజాస్వామిక సూచన అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ చోటులెకుండా ప్రజల అసలు సిసలైన తీర్పును వెలువరించరని వెల్లడించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' డెమాక్రసీ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories