100 మంది బతికున్న భార్యలకు పిండప్రదానం....

Submitted by arun on Mon, 10/08/2018 - 14:05
nasik

తమ కాపురాలకు శాస్త్రోక్తంగా  పిండప్రదానం చేశారు భార్యబాధితులు. పైగా బాధితులంతా ఫెమినిజంపై ఆడిపోసుకున్నారు. స్త్రీవాదం, హక్కులు, సమానత్వం అంటూ భార్యలు తమ కాపురాల్లో అగ్గిపెట్టారని ఆరోపించారు. తమ కాపురాలు చనిపోయాయని అందుకు గుర్తుగా ఈ తతంగం నిర్వహించామంటున్నారు మహారాష్ట్రలో భార్య బాధితులు.

నాసిక్‌లో వందమందికిపైగా పురుషులు తమ బతికున్న భార్యలకు పిండప్రదానం చేశారు. వారు తమకు విముక్తి కల్పిస్తారనే భావనతోనే భర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ గోదావరి నదిలో తర్పణాలు విడిచారు. ఈ తతంగమంతా వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.  

పెళ్లయిన అతి తక్కువ టైంలోనే  చెలరేగిన గొడవలు కాస్త చివరకు విడాకులకు దారి తీస్తున్నాయి. దీంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విసుగు చెందిన భార్య బాధితుల కోసం వాస్తవ్ ఫౌండేషన్ ఏర్పాటైంది బాధిత భర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు బతికుండగానే భార్యలకు ఆ బ్యాచ్‌ అంతా కలిసి కాశీలో పిండప్రదానం చేయిస్తోంది. 

English Title
victim husband pindadan godavari river in nashik

MORE FROM AUTHOR

RELATED ARTICLES