రామమందిర నిర్మాణంపై వీహెచ్‌పీ సంచలనాత్మక నిర్ణయం

Submitted by arun on Sat, 10/06/2018 - 13:17
ayodhya

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై మరోసారి వీహెచ్‌పీ సంచలనాత్మక నిర్ణయం తీసుకొంది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధంచింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తీసుకురాకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ హెచ్చరించింది. కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మరీ అయోధ్యలో రామమందిరం నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక తీర్మానం చేసింది. కోర్టు కేసుల పేరిట కాలయాపన చేయకుండా త్వరితగతిన బిల్లును తీసుకొచ్చి రామాలయం నిర్మించాలని వీహెచ్‌పీ ఉచ్ఛాధికార సమితి తీర్మానించింది.

English Title
VHP sets January-end deadline for Ram temple law

MORE FROM AUTHOR

RELATED ARTICLES