కేసీఆర్‌కు గవర్నర్ చెంచాగిరి చేస్తున్నారు: వీహెచ్

Submitted by arun on Sat, 01/06/2018 - 15:46

 సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు గవర్నర్ చెంచాగిరి చేస్తున్నారని వీహెచ్‌ అన్నారు. ఓట్ల కోసం సీఎం కేసీఆర్‌ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు.  బీసీలంతా ఐక్యంగా ఉండాలి.. కేసీఆర్‌ కుట్రలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు గవర్నర్‌ అమ్ముడుపోయారు...గవర్నర్‌ దగ్గరకు వెళ్లొద్దని చాలాసార్లు మా పార్టీ నేతలకు చెబుతున్నానని అన్నారు. గుళ్లు, గోపరాలు తిరిగడానికే మాత్రమే ఈ గవర్నర్‌ పనికొస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌, ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకుంటే న్యాయం జరగదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

English Title
VH sensational Comments On KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES