ప్రముఖ జర్నలిస్ట్‌ కుల్దీప్ నయ్యర్ కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్‌ కుల్దీప్ నయ్యర్ కన్నుమూత
x
Highlights

ప్రముఖ జర్నలిస్ట్‌, కాలమిస్టు కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. 1923 ఆగష్టు 14న...

ప్రముఖ జర్నలిస్ట్‌, కాలమిస్టు కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. 1923 ఆగష్టు 14న జన్మించిన ఆయన ఉర్ధూ పత్రిక అంజమ్‌లో జర్నలిస్ట్‌గా కేరీర్‌ ప్రారంభించారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. 'బిట్వీన్‌​ ది లైన్స్‌' పేరుతో ప్రచురితమైన కాలమ్‌ దాదాపు 80 పత్రికల్లో ప్రచురితమయ్యింది. జర్నలిస్ట్‌గానే కాకుండా మానవ హక్కుల ఉద్యమకారుడిగా కుల్దీప్ అనేక పోరాటాలు చేశారు. మరోవైపు 1990లో బ్రిటన్‌లో భారత రాయబారిగా సేవలందించారు. 1997లో రాజ్యసభకు కూడా నామినేట్‌ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. లోథిలో ఇవాళ మధ్యాహ్నం కుల్దీప్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories