గుండెపోటుతో నటి అనిత మృతి.. ముఖ్యమంత్రి సంతాపం!

గుండెపోటుతో నటి అనిత మృతి.. ముఖ్యమంత్రి సంతాపం!
x
Highlights

గుండెపోటుతో నటి అనిత మృతిచెందారు.. దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించిన అనిత శుక్రవారం హఠాత్తుగా ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. నటిగా తన 25 ఏళ్ల...

గుండెపోటుతో నటి అనిత మృతిచెందారు.. దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించిన అనిత శుక్రవారం హఠాత్తుగా ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. నటిగా తన 25 ఏళ్ల కెరీర్ లో ఒడియాలో తల్లి సహా పలు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మైమరిపించారు. 1975లో విడుదలైన జాజాబొరొ చిత్రం ఆమె నట ఒక జీవితంలో మైలు రాయిగా నిలిచింది. ఆ తరువాత వచ్చిన కృష్ణ సుధామా (1976), రామాయణ్‌ (1980), మా ఓ మమత (1980), (1988), గొడి జణిలే ఘొరొ సుందొరొ (1994), బహుడిబే మో జొగొబొలియా (2003), సాథీరే (2004), ఓం శాంతి ఓం (2005) స్వొప్నొ సాగొరొ (1983), పుఒ మోరొ కొలా ఠకురొ తదితర చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఇక ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. కాగా అనిత మృతి పట్ల ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories