వెంకటేష్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకోబోతోందా!

Submitted by arun on Sat, 09/22/2018 - 14:55
Venkatesh

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి అని సమాచారం. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం త్వరలోనే జరగనుందని ఫిల్మ్ నగర్ టాక్. కుమార్తె ఆశ్రిత ప్రేమకు వెంకటేష్ పచ్చ జెండా ఊపాడట. తనకు పరిచయం ఉన్న యువకుడితో ఆర్షిత ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కూతురు ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకుంది. ఆమె ఓ ప్రముఖుడి కుమారుడిని ప్రేమించిందని తెలుస్తోంది. వారిద్దరి మధ్య చదువుకునే రోజుల నుంచి స్నేహం ఉందట. అది కాస్తా ప్రేమగా అనంతరం పెళ్లిగా మారినట్టు తెలుస్తోంది. ఆశ్రిత ప్రేమ వ్యవహారాన్ని ఇటీవల తన అన్న సురేష్ బాబుతో చర్చించిన వెంకీ.. కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఘనంగా నిశ్చితార్థ వేడుక కూడా నిర్వహించనున్నట్టు సమాచారం.

English Title
Venkatesh's Daughter To Marry Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES