ఆగిపోయిన వెంకీ-తేజ మూవీ..విభేదాల వల్ల అటకెక్కిన సినిమా

ఆగిపోయిన వెంకీ-తేజ మూవీ..విభేదాల వల్ల అటకెక్కిన సినిమా
x
Highlights

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు దర్శకుడు తేజ. దీంతో ఈ తేజకు పెద్ద హీరోల నుంచి అవకాశాలు వచ్చాయి. వెంకటేషన్,తేజ కలిసి ఆటా...

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు దర్శకుడు తేజ. దీంతో ఈ తేజకు పెద్ద హీరోల నుంచి అవకాశాలు వచ్చాయి. వెంకటేషన్,తేజ కలిసి ఆటా నాదే వేటా అనే మూవీని కూడా స్టార్ట్ చేశారు. కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ ఎవరు ఊహించని రేంజ్లో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అన్నీ ఒకే అయ్యాక షూటింగ్ స్టార్ చేసే ముందు సినిమా ఆగిపోవడం ఇండస్టీలో కామన్. కానీ షూటింగ్ స్టార్ అయ్యాక కూడా సినిమాకు బ్రేక్ పడడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. వెంకటేష్,తేజ సినిమాకు అలాంటి సీనే ఎదురైంది. అర్భాటంగా మొదలెట్టిన వెంకేటేష్, తేజ మూవీకి మధ్యలోనే అటకెక్కింది.

నేనే రాజు నేను మంత్రి సినిమాతో దాదాపు పుష్కర కాలం తర్వాత హిట్ కొట్టాడు దర్శకుడు తేజ. దీంతో తేజతో ఎప్పటి నుంచో సినిమాకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకీతో పాటు బాలయ్య కూడా ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి అప్పగించాడు. అయితే ఫస్ట్ వెంకటేష్ మూవీని పూర్తి చేసి..ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టాలనేది తేజ్ ప్లాన్. ఆ ప్రణాళిక ప్రకారమే వెంకటేష్ మూవీని స్టార్ట్ చేశాడు. దానికి ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మూడు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో సినిమా మధ్యలోనే ఆపేశారు. దీంతో ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు.

వెంకటేష్ సినిమాను మధ్యలో ఆపేసిన తేజ..వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి షిప్ట్ అయ్యాడు. జనవరి 18న ఎన్టీఆర్ వర్దంతి ఉండడంతో ఆలోపు టీజర్ ను రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారు. తేజతో మూవీ కాన్సిల్ కావడంతో..వెంకీ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. పూరీ లేదా మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ తోనే సినిమా మొదలెట్టే అవకాశం ఉంది. వెంకటేషన్, తేజ్ మూవీ మధ్యలో ఆగిపోవడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా ఓసారి సినిమాను పెట్టాలెక్కించే వరకు తీసుకెళ్లి..మధ్యలో ఆపేశారు. కథ స్టోరీ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉన్నా..మేకింగ్ లో తేజ స్టైల్ వెంకీకి నచ్చకపోవడమే సినిమా కాన్సిల్ కావడానికి కారణమనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వెంకీ, తేజ కాంబో కోసం కష్టపడిన రానా ప్రయత్నం మధ్యలోనే బెడిసి కొట్టినట్టైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories