తొలిప్రేమ ప్రీమియర్ షో టాక్.. యూత్ పండగ చేసుకునే సినిమా..

Submitted by arun on Fri, 02/09/2018 - 10:57
Tholiprema movie

‘ఫిదా’తో హిట్ కొట్టిన నటుడు వరుణ్ తేజ్‌.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తొలిప్రేమ. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న తెలుగు రాష్ర్టాల్లో భారీగా రిలీజ్‌ అవుతోంది. కానీ యుఎస్ లో ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే నేడు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు యుఎస్ లో ప్రదర్శించబడ్డాయి. యుఎస్ అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ తరహా చిత్రాలు యుఎస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. రాశి ఖన్నా, వరుణ్ తేజ్ జంటకు టీజర్ ట్రైలర్ లో ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తొలిప్రేమ చిత్రానికి యుఎస్ ప్రీమియర్స్ నుంచి సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

 

English Title
Varun Tej's Tholiprema movie grand release from tomorrow

MORE FROM AUTHOR

RELATED ARTICLES