పవన్ ను విమర్శించిన శ్రీరెడ్డికి... మెగా హీరో ఘాటు సమాధానం

Submitted by arun on Tue, 04/17/2018 - 17:43
varun

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కోసం పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు మెగా హీరో వరుణ్ తేజ్ స్పందించాడు. సోమవారం శ్రీ రెడ్డి ‘‘పవన్ కల్యాణ్.. నువ్వు ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నావ్ అసలు అమ్మాయి జాతిమీద విలువుందా?. నువ్వు ప్రజా నాయకుడివి అయ్యుండి ఏం మాట్లాడుతున్నావ్. పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి ఇదేనా నువ్ నాకిచ్చే సలహా. ‘పవన్ కల్యాణ్ అన్నా’ అన్నాం కదా అందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకుంటున్నాను. పవన్‌ను ఎవరూ.. ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవదు. అన్నా అన్నందుకు ఒక అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను. పవన్ కల్యాణ్ ***** (రాయలేని పదం వాడింది)" అంటూ అసభ్యంగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై వరుణ్ స్పందించాడు. ఫేస్ బుక్ లో ‘‘నీ గురించి విమర్శంచి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వారి బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు’’ అంటూ దిమ్మదిరిగే పోస్టు పెట్టారు. దీనికి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. 

English Title
varun tej strong counter to sri reddy comments on pawan kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES