సముదాయింపులు... బుజ్జగింపులు.. రాధ దారికొచ్చినట్టేనా?

Submitted by santosh on Thu, 10/11/2018 - 10:51
VANGAVEETI RADHA, YCP VIJAYASAI REDDY

వంగవీటి రాధను బుజ్జగించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.. విజయవాడలో లో రాధా నివాసానికి వెళ్లిన సాయిరెడ్డి అరగంట పాటు చర్చలు జరిపారు. సెంట్రల్ నుండి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో రాధాకు వివరణ ఇచ్చిన సాయిరెడ్డి. బందర్ పార్టమెంటుకు వెళ్లాలని సూచించారు.. 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంన్ ఛార్జిగా మల్లాది విష్ణును నియమించడంతో..  వైసీపీ నేత వంగవీటి రాధా మనస్తాపం చెందారు.. ఈ నేపథ్యంలో రాధాను బుజ్జ‌గించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.. దీనికోసం వైసీపీ కీలక నేత విజయ సాయిరెడ్డి రంగంలోకి దిగారు.. విజయవాడలోని రాధా నివాసంలో ఆయనతో బేటీ అయ్యారు. సుమారు అర‌గంట పాటు వీరిద్ద‌రి స‌మావేశం అయ్యారు.. ఈ స‌మావేశంతో రాధా ఎపిసోడ్ కు ఎలాంటి క్లారిటీ రాలేదు..

పార్టీ కార్యక్రమాలకు 20 రోజులుగా దూరంగా ఉంటున్న రాధను కలిసిన విజయసాయిరెడ్డి.. ఎందుకు సెంట్రల్ నుండి త‌ప్పించాల్సి వ‌చ్చిందో వివ‌రించారు. వ‌చ్చిన స‌ర్వేల నివేదిక‌ల‌ను చూపించిన న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్రం చేశారు. బంద‌రు పార్ల‌మెంట్‌కు వెల్లాల‌ని సూచించిన విజయసాయిరెడ్డి.. రాధాకు అన్నిర‌కాలుగా పార్టీ మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని చెప్పారు. ఆర్ధికంగా నూ సీటు గెలుపె కోసం పార్టీ స‌పోర్టు ఉంటుంద‌ని చెప్పారు.

వరోవైపు విజయసాయిరెడ్డి భేటీపై రాధా పెదవి విరుస్తున్నట్లు సమాచారం.. నివేధిక‌లు చూపించి త‌ప్పించామని చెబుతున్నారంటూ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. సెంట్రల్ నుంచి ఎందుకు తప్పించారన్న విషయంలో పూర్తి క్లారటీ ఇవ్వలేదని రాధా భావిస్తునట్లు తెలుస్తోంది..ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి పార్టీ నుండి ఖ‌చ్చిత‌మైన హామీ రాకుంటే రాధా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

English Title
VANGAVEETI RADHA, YCP VIJAYASAI REDDY

MORE FROM AUTHOR

RELATED ARTICLES