అందుకే పవన్‌ కేసీఆర్‌ను కలిశారు: వీహెచ్‌

Submitted by arun on Tue, 01/02/2018 - 15:32
vh

ముఖ్యమంత్రి కేసీఆర్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే కేసీఆర్‌ను పవన్ కలిశారని ఆరోపించారు. రాష్ట్రపతి కార్యక్రమంలో కేసీఆర్, పవన్‌లు కలసినప్పుడే తనకు డౌట్ వచ్చిందన్నారు. డ్రగ్స్ పెడ్లర్ కాల్విన్ పై ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదో ప్రభుత్వం చెప్పాలని వీహెచ్ ప్రశ్నించారు. 24 గంటల కరెంటు మొదలు కాకముందే కేసీఆర్‌ను పవన్ మెచ్చుకోవడం విడ్డూరమన్న వి.హనుమంతరావు..ఈ పథకంపై రైతుల అభిప్రాయం తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

English Title
V. Hanumantha Rao slams pawankalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES