ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విశేషాలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విశేషాలు
x
Highlights

1947ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 200 ఏళ్ల బానిసత్వం నుండి స్వాతంత్య్రం సాధించి పెట్టిన నాయుకులెందరో ఉన్నారు. కొందరు అతివాదాన్ని...

1947ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 200 ఏళ్ల బానిసత్వం నుండి స్వాతంత్య్రం సాధించి పెట్టిన నాయుకులెందరో ఉన్నారు. కొందరు అతివాదాన్ని అనుసరిస్తే, కొందరు మితవాదాన్ని అనుసరించారు. వాదం ఏదైనా (ని)నాదం ఒక్కటే ‘స్వాతంత్య్రం సాధించాలి. అసలు ఈ పోరాటం ముందు ఎక్కడ మొదైలెందని అడిగితే ఎవైరెనా చెప్పే సమాధానం ప్రథమ స్వాతంత్య్ర సమరం గురించి. కానీ ఎవరికీ తెలియని చరిత్ర ఒకటుంది. అది కూడా ఓ తెలుగువాడి చరిత్ర. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మొదటి వ్యక్తి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా అయితే ఆయన తర్వాత భారతీయుల స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అప్పుడప్పుడూ ఈ పేరుని కొందరు వినే ఉంటారు. కానీ మరుగునపడిన ఈ స్వాతంత్య్ర యోధుడి గురించిన నిజాలను వెలుగులో తీసుకురావడానికి టాలీవుడ్ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా రూపొందుతోన్న చిత్రమే సైరా నరసింహారెడ్డి. కుంఫిణీ మూకలను మన దేశం నుండి పారద్రోలడానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మ్రోగించిన సమర శంఖంలో కొన్ని విశేషాలను తెలుసుకుందాం...

రాయలసీమ ప్రాంతంలో చెంచు రెడ్ల వంశానికి చెందినవాడు జయరామిరెడి. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద మల్లారెడ్డి, చిన్న మల్లారెడ్డి. వీరితో పాటు జయురామిరెడ్డి తన సోదరి కుమారుడు నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. రూపనగుడిలో పుట్టిన నరసింహారెడ్డి ఉయ్యాలవాడలో పెరగడంతో అందరూ అతన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పిలిచేవారు. అయితే బ్రిటీష్‌వారి నుండి నొస్సం కోటలో పాలెగాడుగా ఉంటూ పదకొండు రూపాయుల తవర్జీని అందుకునేవారు. కానీ బ్రిటీష్‌వారి పాలనలో తవర్జీ అందుకోవడం నరసింహారెడ్డికి ఇష్టం ఉండేది కాదు.

పోరాటం మొదైలెందిలా...
ఓసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తనకు రావాల్సిన తవర్జీ కోసం తన అనుచరుడు ఖాసీం సాహెబ్‌ను కోవెల కుంట్ల తాసీల్దారు వద్దకు పంపారు. అయితే రాఘవచారి ఉయ్యాలవాడను అవమానించి అతడినే తన వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. దాంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కోపం వచ్చింది. కుంఫిణీ ప్రభుత్వం(బ్రిటీష్‌వారు)కు ఎదురు తిరగాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ముందుగా తాను కోవెలకుంట్ల ఖజానానా కొల్లగొడతానని 1846 జూలై 10న లేఖ పంపారు. అన్నమాట ప్రకారమే కోవెలకుంట్ల ఖజానాను కొల్లగొట్టి రాఘవచారిని చంపేశాడు. దీంతో కుంఫిణీ ప్రభుత్వానికి చెందిన కలెక్టర్ క్రాకేన్ ఆదేశాల మేరకు లెఫ్ట్టినెంట్ వాట్సన్ నొస్సం కోటైపెకి దండెత్తాడు. కానీ ఆ యుద్ధంలో వాట్సన్‌ను నరసింహారెడ్డి చంపేశాడు. ఈ యుద్ధంలో కర్నూలు కోవెలకుంట్లకు చెందిన గోసాయి వెంకన్న నరసింహారెడ్డికి మార్గ నిర్దేశం చేశారు. ఈ యుద్ధం తర్వాత నరసింహారెడ్డి తన స్థావరాన్ని నల్లమల అడవులకు మార్చుకున్నారు. ఉయ్యాలవాడను పట్టుకోలేని బ్రిటీష్ ప్రభుత్వం నరసింహారెడ్డిని పట్టిస్తే పదివేల రూపాయులిస్తామని ప్రకటించింది. ఆ డబ్బుకు ఆశపడి రుద్రవరం తాసీల్దారు శ్రీనివాసరెడ్డి, రోశి రెడ్డి(రుద్రవరం గ్రామానికి పక్కనున్న దువ్వూరు గ్రామానికి చెందిన వ్యక్తి నర్సిరెడ్డి, ఇతను నరసింహారెడ్డికి ఆప్తుడు. నర్సిరెడ్డి తనయుడే రోశిరెడ్డి) ఈ ప్రయుత్నంలో ఇద్దరూ ప్రజల చేతిలో హతవువుతారు. అయితే నరసింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి బ్రిటీష్‌వారి డబ్బుకు, వారిచ్చే పదవులకు ఆశపడి నరసింహారెడ్డి స్థావరాన్ని తెలియుజేస్తాడు.

బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన కెప్టెన్ రస్సెల్, నార్టన్‌లు నల్లమల ప్రాంతంలోని మారెమ్మ కుంట దగ్గర నరసింహారెడ్డితో యుద్ధం చేసి గెలవాలనుకుంటారు. కానీ యుద్ధంలో రస్సెల్ చనిపోతాడు. మళ్లీ నరసింహారెడ్డి తన స్థావరాన్ని ఎర్రవులకు మార్చేస్తారు. 1846 అక్టోబర్ 6న ఎర్రమల దగ్గర కొండల్లో క్రాకేన్, నార్టన్ నాయుకత్వంలోని బ్రిటీష్ సైన్యం నరసింహారెడ్డి సైన్యంతో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో నార్టన్ మరణించినా నరసింహారెడ్డి బ్రిటీష్ సైన్యం చేతికి చిక్కారు. బ్రిటీష్ ప్రభుత్వం 1847 జనవరి 9న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీయాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. తీర్పు ప్రకారం 1847 ఫిబ్రవరి 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీశారు. అదే రోజు రాత్రి ఆయన తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వ్రేలాడ దీశారు. ఉయ్యాలవాడ తల కోవెలకుంట్ల కోట గుమ్మానికి మూడు దశాబ్దాల పాటు వేలాడింది.

పోరాటానికి సినీ రూపం..
రవి ఆస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం సలిపిన వీరులెందరో. అయితే అందరిలో పోరాట జ్వాలను రగిల్చిన తొలి పోరాట ప్రమీదలుగా నిలిచిన వారిలో మన తెలుగు తేజం నరసింహారెడ్డి అగ్రగణ్యుడు. ఇలాంటి ఓ మహావీరుని చరిత్ర కాలక్రమంలో మరుగునపడ్డప్పటికీ మళ్లీ వెలుగులోకొచ్చింది. దీన్ని సినిమాటిక్‌గా మలిచే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా సీనియర్ హీరో చిరంజీవి టైటిల్ పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్‌తో పాటు జగపతిబాబు, కన్నడ నటుడు సుదీప్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నయునతార, ముఖేష్ రుషి వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఎ.ఆర్.రెహమాన్, రవివర్మన్ వంటి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్‌లో ఎవరు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారోనని అందరిలో కుతూహలం మొదైలెంది. ఏ నటుడు ఎలాంటి పాత్రల్లో కనిపించనున్నారనే దానిపై వివరణ...

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి: ఈ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు.

గోసాయి వెంకన్న: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ ఈ సినిమాలో చిరంజీవి గురువు పాత్రలో కనపడనున్నారు. ఈ వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సమాచారం ప్రకారం అమితాబ్ గోసాయి వెంకన్న అనే పాత్రలో కనపడతారు. చరిత్ర ప్రకారం చూస్తే గోసాయి వెంకన్న పాత్ర..ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి పురికొల్పే పాత్ర.

మల్లారెడ్డి: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటీష్‌కు పట్టించడానికి సహాయుపడ్డ వ్యక్తి. బ్రిటీష్ వారిచ్చే డబ్బులు, పదవులకు ఆశపడి మల్లారెడ్డి నరసింహారెడ్డి అచూకీని బ్రిటీష్‌వారికి అందచేస్తాడు. ఈ పాత్రలో దాదాపు జగపతిబాబు నటించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ మధ్య జగపతిబాబు నెగటివ్ టచ్ ఉన్న పాత్రలను చేస్తున్నారు కాబట్టి.

సుబ్బమ్మ: నరసింహారెడ్డి భార్య. ఈ పాత్రలో మలయాళీ ముద్దుగుమ్మ నయనతార నటిస్తుంది.


ఖాసీం, ఓబయ్య : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముఖ్య అనుచరులు. ఈ పాత్రలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ లేదా తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయి. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. రెహమాన్ తొలి చిత్రం రోజాలోనే ఓ దేశభక్తి గీతంలో తన మార్కును సంగీతాన్ని రుచి చూపించారు. అనంతరం భారతీయుడు సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా దేశభక్తి మీదనే సాగుతుంది. అలాగే లగాన్, రంగ్‌దే బసంతి వంటి దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాలకు ఎ.ఆర్.రెహమాన్ అందించిన మ్యూజిక్ పెద్ద ఎసెట్ అయ్యింది. అలాగే రెహమాన్ ప్రైవేట్ ఆల్బమ్ వందేమాతరం ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇక ఎ.ఆర్.రెహమాన్‌కు ఆస్కార్ అవార్డ్‌ను సంపాదించి పెట్టిన జయహో సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి రెహమాన్ అందించే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ సైరా నరసింహారెడ్డి మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్టోబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం చరిత్ర మరచిపోయిన వీరుడిని పరిచయం చేస్తుందనడంలో సందేహం లేదు.

తవర్జీ అంటే...
పాలెగాళ్ల వ్యవస్థను బలోపేతం చేసింది విజయునగర సామ్రాజ్యానికి చెందిన రాజలు. ఒక్కొక్క పాలెగాడి క్రింద వంద నుండి రెండు వందల గ్రామాలు ఉండేవి. వీరు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునేవారు. అయితే క్రీ.శ 1800వ సంవత్సరంలో నిజాం నవాబు తన ఆధీనంలోని కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను బ్రిటీష్ వారికి లీజుకి ఇచ్చాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాలను సీడెడ్ జిల్లాలని సంబోధించేవారు. బ్రిటీష్‌వారు పాలెగాళ్ల స్వతంత్ర పాలనను ఇష్టపడక యుద్ధం చేసి చాలా మందిని ఖైదు చేశారు. రాజీకి వచ్చిన వారికి వారి ఆధీనంలోని గ్రామాలను అనుసరించి కొంత భరణం ఇవ్వడం ప్రారంభించారు. ఈ భరణాన్నే తవర్జీ అని పిలిచేవారు.

నెత్తురు కుంట...
మారెమ్మకుంట దగ్గర ఉయ్యాలవాడ సైనికులకు, బ్రిటీష్ సైనికులకు జరిగే యుద్ధంలో ఉయ్యాలవాడ బ్రిటీష్ సైనికులను ఊచకోత కోశారు. బ్రిటీష్ వారి రక్తంతో మారెమ్మకుంట ఎర్రబడింది. అప్పటి నుండి ఈ కుంటను నెత్తుటికుంట అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories