నిద్రలోనే మహిళకు నిప్పటించారు

Submitted by arun on Fri, 03/09/2018 - 16:53
Burnt Alive

తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదని ఓ దళిత మహిళపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన దళిత మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బల్లియా జిల్లా జజౌలి గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 

జజౌలి గ్రామానికి చెందిన రేష్మా దేవి(45) గ్రామంలోని సోనూ ఓ వ్యాపారి వద్ద రూ. 20 వేలు అప్పుగా తీసుకుంది. ఈ మధ్యే ఆ అప్పును చెల్లించగా.. వడ్డీ కోసం ఆమెను వేధించటం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె కట్టనని తెగేసి చెప్పటంతో ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి మంచంపై నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్‌ పోసి తగలబెట్టారు. ఆమె కేకలకు అంతా నిద్రలేవటంతో నిందితులు పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి స్టేట్‌ మెంట్‌ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


 

English Title
Uttar Pradesh: Dalit Woman Burnt Alive in Ballia Over Loan Repayment

MORE FROM AUTHOR

RELATED ARTICLES