ఉత్తమ్‌ యుద్దం వెనుక ఆరుగురి బలగం... ఎవరా ఆరుగురు?

Submitted by santosh on Fri, 11/16/2018 - 12:24
uttamkumar soldiers

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో బిజిగా ఉండటంతో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ను కంటికిరెప్పలా చూసుకుంటారు పద్మావతి. అసమ్మతి చెలరేగకుండా, ఎప్పటికప్పుడు చల్లారుస్తారు. ఉత్తమ్‌ ఎలక్షన్‌ క్యాంపెయిన్‌కు ప్లాన్‌ చేసేది కూడా ఈమెనే. అలాగే ఉత్తమ్ యువసేనతో పాటు అనేక అభిమాన సంఘాలను మొబిలైజ్ చేస్తుంటారు. ఒకవైపు కోదాడ మరోవైపు హుజూర్‌నగర్‌లను కాపాడుకుంటూ, తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంలో అనేక వ్యూహాలు వేస్తారు పద్మావతి. ప్రతి పురుషుడి విజయం వెనకా ఓ స్త్రీ ఉంటుందన్నదానికి, తన భార్యే నిదర్శనమని చాలాసార్లు చెప్పారు ఉత్తమ్. అలా ఉత్తమ్ బలగంలో కీ ప్లేయర్‌ పద్మావతి.

గూడూరు నారాయణ రెడ్డి. ఉత్తమ్‌ టీంలో ట్రబుల్‌ షూటర్‌. టీపీసీసీ కోశాధికారి అయిన నారాయణ రెడ్డి, అటు ఏఐసీీసీ, ఇటు ఉత్తమ్‌ మధ్య అన్ని వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఉత్తమ్‌పై ఎలాంటి విమర్శలొచ్చినా తిప్పికొట్టేందుకు రెడీగా ఉంటారు.దీపక్‌ జాన్. డిజిటల్ వారియర్. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోషల్‌ మీడియా అకౌంట్లను మ్యానేజ్‌ చేసేది ఈయనే. అలాగే పార్టీ సోషల్‌ వెబ్‌సైట్లలలో యాక్టివ్‌గా ఉంటారు. బూత్‌ లెవల్‌లో సోషల్ మీడియా హెడ్‌లను అపాయింట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక మాధ్యమాల్లో, వేలల్లో ఫాలోవర్స్‌ను మెయిన్‌టైన్‌ చేస్తూ, ఉత్తమ్‌కు సంబంధించిన వీడియోలు, పోస్టింగ్‌లను క్షణాల్లోనే షేర్‌ చేస్తుంటారు దీపక్ జాన్‌ నేతృత్వంలోని డిజిటల్ టీం.

మదన్‌ మోహన్. తెలంగాణ కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ హెడ్. మానవ వనరుల విభాగాన్ని పర్యవేక్షిస్తుంటారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలంతా, ఉత్తమ్‌తో టచ్‌లో ఉండేలా కమ్యూనికేషన్‌ వ్యవస్థను తీర్చిదిద్దారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నేరుగా ఉత్తమ్‌కు ఫీడ్‌ బ్యాక్‌ అందించేలా, అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తారు మదన్‌ మోహన్. అలా ఉత్తమ్‌ టీంలో మదన్‌ మోహన్‌ మరో కీలక సభ్యుడు. దాసోజు శ్రవణ్ కుమార్. తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి. ఉత్తమ్‌ జట్టులో మరో కీ మెంబర్‌. తనపై, పార్టీపై ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను తిప్పికొట్టాలన్నా, సమాచారం కోసం ఉత్తమ్‌ సంప్రదించేది మొదట శ్రవణ్‌నే. అధికార పార్టీపై ఆరోపణలు సంధించేందుకు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌‌ వంటి ప్రోగ్రామ్స్‌ను డిజైన్‌ చేసింది శ్రవణే. ఉత్తమ్‌ తరపున టీఆర్ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఎప్పుడూ ముందుంటారు శ్రవణ్‌. తనకు నమ్మిన బంటు అయిన శ్రవణ్‌కు, ఖైరతాబాద్‌ టికెట్‌ ఇప్పించారు ఉత్తమ్. 

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సైన్యంలో ఆరో వ్యక్తి షేక్‌ అహ్మద్ అలీ. ఉత్తమ్‌కు వ్యూహాలు సిద్దం చేయడంలో దిట్ట. పార్టీతో సంబంధం లేకుండా ఉత్తమ్‌ పర్సనల్‌ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపులను పర్యవేక్షిస్తుంటాడు. పార్టీ కార్యకర్తలతో ఎఫ్‌బీలో లైవ్‌లు ఏర్పాటు చేస్తుంటాడు. వాట్సాప్‌ గ్రూపులతో, ఉత్తమ్‌కు సంబంధించిన ఎలాంటి నెగెటివ్‌ సమాచారాన్నయినా తెప్పించుకుంటాడు. అన్నింటినీ క్రోడీకరించి ఉత్తమ్‌కు ఫీడ్‌ బ్యాక్‌ అందిస్తాడు. ఇలా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి యుద్ధం వెనక, ఆరుగురి బలగముంది. ఎప్పటికప్పుడు సకల అస్త్రాలనూ అందిస్తూ, ఉత్తమ్‌కు నలుదిక్కులా అండగా ఉంటారు వీరంతా.

English Title
uttamkumar soldiers

MORE FROM AUTHOR

RELATED ARTICLES