గడ్డం పరీక్షలో ఉత్తమ్‌ పాస్‌ అవుతారా?

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. అయితే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌‌ది కొంచెం డిఫరెంట్‌ స్టైల్‌. సినీ స్టైల్లో ఆవేశంగా పంచ్‌లు...

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. అయితే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌‌ది కొంచెం డిఫరెంట్‌ స్టైల్‌. సినీ స్టైల్లో ఆవేశంగా పంచ్‌లు డైలాగులు పేల్చకపోయినా అంతకంటే ఎక్కువ హైటెన్షన్‌ శపథమే చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేవరకు గడ్డం తీయనని సవాలు విసిరారు. మరి గడ్డం పరీక్షలో ఉత్తమ్‌ పాస్‌ అవుతారా? ఉత్తమ్‌ ఆశించినట్లు ప్రజా కూటమి అధికారంలోకి రాబోతుందా? అసలు డిసెంబర్ 11 తర్వాత ఉత్తమ్‌ గడ్డం తీస్తారా? లేదా? టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ శపథం నెరవేరుతుందా? తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేదాక గడ్డం తీయని శపథం చేసిన ఉత్తమ్ అన్నట్లుగానే ఏడాది నుంచి గబురు గడ్డంతో కనబడుతున్నారు.

అంతేకాదు కాంగ్రెస్ గెలిచినా ఓడినా తనదే బాధ్యతన్న ఉత్తమ్‌ ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి నుంచి తప్పుకుంటారని, గాంధీభవన్ మొహం కూడా చూడనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి డిసెంబర్ 11 తర్వాత ఉత్తమ్‌ గడ్డం తీస్తారా? లేదా? ఆయన అనుకున్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా అధికారంలోకి రాబోతుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్ 12 లేదా 13న గడ్డం తీయబోతున్నానని ప్రకటించారు.

అయితే ఉత్తమ్‌ గడ్డం శపథంపై మొదట్నుంచీ టీఆర్‌ఎస్‌ సైటెర్లు వేస్తోంది. ఉత్తమ్‌ గడ్డం అలా పెరిగిపోవాల్సిందే తప్ప కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని కేటీఆర్ ఎన్నోసార్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గడ్డం పెంచుకొనేవాళ్లందరూ గబ్బర్ సింగ్‌లు అయిపోతారా? ఆయన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కాదు గడ్డంకుమార్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. డిసెంబర్ 11న గడ్డం కాదు... ఏకంగా గుండు గీయించుకోవాల్సిందేనంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఉత్తమ్‌ ఆశించినట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా? ఉత్తమ్‌ గడ్డం శపథం నెరవేరుతుందో లేదో డిసెంబర్ 11న తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories